News October 3, 2025
‘కర్రల సమరంలో చనిపోయిన ఈ వ్యక్తిని గుర్తిస్తే చెప్పండి’

కర్నూలు(D) దేవరగట్టు బన్నీ ఉత్సవాల్లో జరిగిన కర్రల సమరంలో మృతుల సంఖ్య 4కు చేరింది. మృతుల్లో ముగ్గురిని.. ఆలూరు మండలం అరికెర గ్రామానికి చెందిన తిమ్మప్ప, ఆలూరుకు చెందిన నాగరాజు, కర్ణాటకకు చెందిన బసవరాజుగా పోలీసులు గుర్తించారు. నాలుగో వ్యక్తి ఎడమ చేతిపై NBK అని పచ్చబొట్టు ఉందని, బంధువులు కానీ, మిత్రులు కానీ గుర్తిస్తే హొళగుంద ఎస్ఐ 91211 01161, ఆలూరు సీఐ 91211 01157 నంబర్లకు ఫోన్ చేయాలని కోరారు.
Similar News
News October 3, 2025
హైకోర్టు తీర్పు ప్రకారమే అనుమతి పునరుద్ధరణ

హైకోర్టు తీర్పును అనుసరించి రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో ఆదిత్య కంపెనీ నిర్మాణ సంస్థకు అనుమతుల్ని పునరుద్ధరించామని హెచ్ఎండీఏ వెల్లడించింది. ఎలాంటి నిబంధనల ఉల్లంఘన జరగలేదన్నారు. 2022లో ఆదిత్య కేడియా మంచిరేవులో 9.19 ఎకరాల్లో బహుళ అంతస్తుల భవన నిర్మాణానికి హెచ్ఎండీఏ అనుమతిని జారీ చేసిందని చెప్పారు. కోర్టు తీర్పుతో పలు మార్పులు, పరిశీలనలు చేసి అనుమతులు పునరుద్ధరించారు.
News October 3, 2025
రాజమండ్రి: ఆటో డ్రైవర్లకు రూ.17 కోట్ల 87 లక్షల ఆర్థిక సాయం

ప్రభుత్వం ప్రవేశపెట్టిన “ఆటో డ్రైవర్లు సేవలో” పథకం కింద తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం 11,915 మంది ఆటో డ్రైవర్లు లబ్ధి పొందనున్నారని జిల్లా రవాణా అధికారి సురేష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒక్కో ఆటో డ్రైవర్‌కు రూ.15,000 చొప్పున నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామన్నారు. మొత్తం రూ.17,87,25,000ల మేర ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.
News October 3, 2025
క్రీడలు సానుకూలమైన దారిలో దిశానిర్దేశం చేస్తాయి:CP

క్రీడా కార్యక్రమాలు యువతకు సానుకూలమైన దారిలో దిశానిర్దేశం చేస్తాయని నిజామాబాద్ పోలీస్ కమీషనర్ సాయి చైతన్య అన్నారు. శుక్రవారం ఆయన క్రీడాపోటీల ముగింపులో మాట్లాడుతూ.. యువత దేశ భవిష్యత్తు అని, వారు ఆరోగ్యంగా ఉంటూ మంచి ఆశయాలతో, పట్టుదలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కమీషనర్ క్రికెట్ ఆడి యువతలో ఉత్సాహం నింపారు.