News February 8, 2025

కర్రివలసలో వ్యక్తి ఆత్మహత్య

image

పాచిపెంట మండలం కర్రివలస గ్రామంలో దాసరి శంకరరావు(35) ఆత్మహత్య చేసుకున్నారని ఏఎస్సై బి.ముసలినాయుడు తెలిపారు. శనివారం మాట్లాడుతూ.. భార్యభర్తల మధ్య గొడవల కారణంగా శంకరరావు శుక్రవారం మధ్యాహ్నం పురుగుల మందు తాగాడు. సాలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేసి విజయనగరం మహారాజ ఆసుపత్రికి రిఫర్ చేశారని, అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారన్నారు. భార్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.

Similar News

News January 8, 2026

జాతీయ షూటింగ్‌ బాల్‌ పోటీలకు కృష్ణా జిల్లా క్రీడాకారులు

image

మహారాష్ట్రలోని సోలాపూర్‌లో జనవరి 8 నుంచి 10 వరకు జరిగే సీనియర్ జాతీయ షూటింగ్‌ బాల్‌ పోటీలకు కృష్ణా జిల్లా క్రీడాకారులు ఎంపికయ్యారు. కావలిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ చాటిన పి.హనీత్ నాగ్, పి.శరన్ హేమంత్, సురేఖ జాతీయ స్థాయికి అర్హత సాధించారు. విజయవాడ నుంచి పోటీలకు బయలుదేరిన ఈ క్రీడాకారులను పలువురు ప్రముఖులు అభినందిస్తూ, పతకాలతో తిరిగి రావాలని ఆకాంక్షించారు.

News January 8, 2026

NLR: వృద్ధాశ్రమాలకు అనుమతులు ఉండాల్సిందే..!

image

నెల్లూరు జిల్లాలో వృద్ధాశ్రమాల నిర్వహణకు స్వచ్ఛంద సేవా సంస్థలు తప్పనిసరిగా అనుమతులు పొందాలని విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాల వృద్ధుల సంక్షేమ శాఖ సంచాలకులు అహ్మద్ అయూబ్ ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. అనుమతులు లేని వయోవృద్ధుల ఆశ్రమాలపై 2007 వయోవృద్ధుల చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరిన్ని వివరాలకు నెల్లూరులోని తమ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.

News January 8, 2026

ఆదిలాబాద్: విద్యార్థులకు మెరుగైన విద్యావకాశాలుకల్పించాలి: కలెక్టర్

image

నార్నూర్ ఆస్పిరేషనల్ బ్లాక్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు మెరుగైన విద్యావకాశాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇంగ్లీష్ ఫౌండేషన్ అభ్యాసన నైపుణ్యాలు, తదితర అంశాలపై విద్యాశాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు పోటీ ప్రపంచంలో రాణించాలంటే ఆంగ్ల భాషపై పట్టు సాధించడం ఎంతో అవసరమన్నారు.