News July 8, 2025

కర్రెగుట్టలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చి దిద్దుతాం: సీతక్క

image

వెంకటాపురం మండలంలోని కర్రెగుట్టలను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని మంత్రి సీతక్క అన్నారు. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఉన్న ఈ గుట్టలు ఎన్నో జలపాతాలకు, అటవీ సంపదకు, వన్యప్రాణులకు నిలయంగా ఉన్నాయని అన్నారు. ఈ ప్రాంతం పర్యాటక రంగంగా అభివృద్ధి చెందితే వెంకటాపురం, వాజేడు ప్రాంతాలు పర్యాటక హబ్‌గా మారుతాయన్నారు.

Similar News

News July 8, 2025

‘రేషన్ కార్డుదారులు ఈ కేవైసీ చేయించుకోవాలి’

image

ఖమ్మం: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలనుసారం రేషన్ కార్డుదారులందరు ఆయా రేషన్ షాపులలో ఈ-కేవైసీ చేయించుకోవాలని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి చందన్ కుమార్ తెలిపారు. జిల్లాలోని 4,15,905 రేషన్ కార్డులకుగాను 12,03,943 మంది ఉన్నారు. ఇందులో 9,64,236 మంది మాత్రమే ఈ-కేవైసీ చేయించుకున్నారని చెప్పారు. మిగిలిన వారందరూ వెంటనే సమీపంలోని రేషన్ దుకాణాల్లో ఈ-కేవైసీ చేయించాలని సూచించారు.

News July 8, 2025

రాష్ట్రంలో రానున్న 3 రోజులు వర్షాలు

image

AP: పశ్చిమ బెంగాల్ పరిసరాల్లోని అల్పపీడనం పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతోందని IMD తెలిపింది. దీనికి అనుగుణంగా ద్రోణి కూడా కొనసాగుతోంది. రానున్న రెండ్రోజుల్లో అల్పపీడనం ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్‌వైపు కదులుతుంది. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. రేపటి వరకు మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని సూచించింది.

News July 8, 2025

మూడ్రోజుల్లో రైతులకు ధాన్యం కొనుగోలు నగదు: మార్క్‌ఫెడ్

image

AP: రైతులకు మార్క్‌ఫెడ్ ఎండీ ఢిల్లీరావు శుభవార్త చెప్పారు. ‘రాష్ట్ర ప్రభుత్వ హామీతో జాతీయ సహకార అభివృద్ధి సంస్థ(NCDC) నుంచి రూ.వెయ్యి కోట్లు రుణం పొందేందుకు మార్క్‌ఫెడ్‌కు అనుమతి లభించింది. రుణం అందగానే ధాన్యం సేకరించిన పౌర సరఫరాల సంస్థకు నగదు బదిలీ చేస్తాం. తద్వారా పౌర సరఫరాల సంస్థ రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి సంబంధించి నగదు చెల్లింపులు వెనువెంటనే చేస్తుంది’ ఆయన పేర్కొన్నారు.