News February 19, 2026

కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు హతం

image

కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఐదుగురు అగ్రనేతలు మృతిచెందినట్లు సమాచారం. ఈ ఉదయం ఆపరేషన్-2 కగార్ ప్రారంభమైన విషయం తెలిసిందే. కూంబింగ్ చేస్తున్న CRPF బలగాలకు మావోయిస్టులు ఎదురు పడటంతో కాల్పులు జరపగా ఐదుగురు మావోలు హతమయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ఆస్కారముంది. మావోయిస్ట్ కార్యదర్శి దేవ్ జీ టార్గెట్‌గా కూంబింగ్ కొనసాగుతోంది.

Similar News

News February 19, 2026

₹10 లక్షల కోట్లతో అంబానీ AI ప్లాన్స్

image

ఢిల్లీ వేదికగా జరుగుతున్న AI సదస్సులో ముకేశ్ అంబానీ, TATA ఛైర్మన్ చంద్రశేఖరన్ కీలక ప్రకటనలు చేశారు. రిలయన్స్ రాబోయే ఏడేళ్లలో ఏకంగా ₹10లక్షల కోట్లు AI మౌలిక సదుపాయాలపై పెట్టుబడి పెట్టనున్నట్లు అంబానీ తెలిపారు. ఇంటెలిజెన్స్‌తో భారత్‌ను అనుసంధానిస్తామని పేర్కొన్నారు. మరోవైపు INDలో తొలి AI ఆప్టిమైజ్డ్ డేటా సెంటర్‌ను నిర్మిస్తున్నట్లు.. దీనికోసం OpenAIతో డీల్ చేసుకున్నట్లు టాటా గ్రూప్ ప్రకటించింది.

News February 19, 2026

టీటీడీకి హెరిటేజ్ నెయ్యి సరఫరా చేయలేదు: BR నాయుడు

image

AP: కల్తీ నెయ్యి కేసులో పీకల్లోతు కూరుకుపోయిన YCP హెరిటేజ్ కంపెనీపై ఆరోపణలు చేయడం దుర్మార్గమని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు మండిపడ్డారు. హెరిటేజ్ ఎప్పుడూ టీటీడీకి నెయ్యి సరఫరా చెయ్యలేదని స్పష్టం చేశారు. మండలిలో ప్రతిపక్ష నేతగా బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న బొత్స విషయాలు తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు. దేవదేవుని సొమ్ముని నైవేద్యాలకు, అన్న ప్రసాదాలకు వాడే అంశంలో రాజీపడేది లేదని ట్వీట్ చేశారు.

News February 19, 2026

నెలసరికి ముందు ఇవి మేలు..

image

నెలసరికి ముందు ఆడవారి శరీరంలో అనేక మార్పులు వస్తాయి. వీటి వల్ల ఒళ్లు బరువుగా ఉండటం, కడుపు నొప్పి, రొమ్ముల సలపరం వేధిస్తాయి. దీన్నే ప్రీ మెన్‌స్ట్రువల్ సిండ్రోమ్ అంటారు. ఈ లక్షణాలు తగ్గించడానికి డైట్‌లో డ్రైఫ్రూట్స్‌, మిల్లెట్స్‌, పెసలు, అలసందలు చేర్చుకోవాలి. శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉన్న ఆహారాలు, కూల్ డ్రింక్స్, కాఫీలు ఎక్కువగా తీసుకుంటే నెలసరి సమస్యలు మరింత పెరుగుతాయంటున్నారు నిపుణులు.