News August 26, 2025

కర్లపాలెం అంగన్వాడీ కేంద్రం పని తీరుపై కలెక్టర్ అసహనం

image

అంగన్వాడీ కేంద్రంలో ఆటపాటలతో పాటు విద్యా బోధన జరగాలని కలెక్టర్ వెంకట మురళి సూచించారు. కర్లపాలెం మండలం కర్లపాలెం ఎంఎన్ రాజుపాలెంలోని కోడ్ నంబర్-128 అంగన్వాడీ కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రీ స్కూల్ నిర్వహణపై ఆరా తీశారు. అంగన్వాడీ కార్యకర్త అడిగిన ప్రశ్నలకు చిన్నారులు సరిగా స్పందించకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. చిన్నారులకు బాల్యం నుంచే విద్యాబుద్ధులు నేర్పాలన్నారు.

Similar News

News August 27, 2025

చందుర్తి పోలీస్ స్టేషన్‌లో ఏఎస్పీ ఆకస్మిక తనిఖీ

image

చందుర్తి మండల పోలీస్ స్టేషన్‌ను వేములవాడ సబ్ డివిజన్ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్లోని సిబ్బందితో సమావేశమై పలు సూచనలు చేశారు. రాబోయే వినాయక నిమజ్జనోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా శాంతియుత వాతావరణంలో పూర్తి చేయాలని, అలాగే విజిబుల్ పోలీసింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె ఆదేశించారు.

News August 27, 2025

RGM: TBGKS కేంద్ర కోశాధికారిగా చెల్పూరి సతీశ్

image

తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(TBGKS) కేంద్ర కోశాధికారిగా రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన చెల్పూర్ సతీశ్‌ను నియమిస్తున్నట్లు యూనియన్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి పేర్కొన్నారు. గత 20 ఏళ్లుగా BRS పార్టీలో పనిచేస్తూ విద్యార్థి నాయకుడిగా, యూనియన్‌లో క్రియాశీలకంగా పనిచేసిన సతీశ్‌ను ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు. తన నియామకానికి సహకరించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

News August 27, 2025

పెద్దపల్లి: క్రైస్తవుల సమస్యల పరిష్కారానికి చర్యలు: దీపక్ జాన్

image

తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ దీపక్ జాన్ మంగళవారం పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో పాస్టర్లతో సమావేశం నిర్వహించి, చర్చి నిర్మాణ అనుమతులు, బరియల్ గ్రౌండ్స్, కుల ధ్రువపత్రాలు, క్రిస్టియన్ భవన్ ఏర్పాటుకు సంబంధించిన వినతులను పరిశీలించారు. అవసరమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ డి.వేణుతోపాటు సంబంధిత అధికారులను ఆదేశించారు.