News February 24, 2025
కర్లపాలెం: విద్యుత్ ఘాతంతో రైతు మృతి

విద్యుత్ ఘాతానికి గురై రైతు మృతి చెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. కర్లపాలెం మండలం తిమ్మారెడ్డిపాలెం సమీపంలో కొత్త నందాయపాలెంకి చెందిన రైతు సుబ్బారెడ్డి మిర్చి పొలంలో నీరు పెట్టేందుకు వెళ్ళాడు. ఈ క్రమంలో బోరు స్విచ్ వేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ నేపథ్యంలో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News February 25, 2026
తిరిగి జట్టులో చేరనున్న రింకూ సింగ్!

T20 WC: తండ్రికి అనారోగ్యం నేపథ్యంలో చెన్నై క్యాంప్ నుంచి రింకూ సింగ్ వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రేపు జింబాబ్వేతో మ్యాచ్ నేపథ్యంలో ఇవాళ అతడు తిరిగి భారత జట్టులో చేరతారని బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ తెలిపారు. అయితే రింకూ తుది జట్టులో ఉంటారా, లేదా అనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. WCలో ఇప్పటిదాకా అతడు ఆడిన 5 మ్యాచుల్లో 24 రన్స్ మాత్రమే చేయడం గమనార్హం.
News February 25, 2026
ఏకీకృత కుటుంబ సర్వేను పూర్తి చేయాలి: కలెక్టర్

యలమంచిలి మండలంలో ఏకీకృత కుటుంబ సర్వే ప్రక్రియను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. బుధవారం యలమంచిలి తహశీల్దార్ కార్యాలయాన్ని ఆమె ఆకస్మికంగా సందర్శించారు. మండలంలో సాగుతున్న ఏకీకృత కుటుంబ సర్వే, ఈ-కేవైసీ, పీ-4 కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు. సర్వేలో ఎలాంటి పొరపాట్లు లేకుండా పారదర్శకంగా నిర్వహించాలన్నారు.
News February 25, 2026
విశాఖలో పర్యటించనున్న ఒడిశా గవర్నర్

ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు ఫిబ్రవరి 26 నుంచి మార్చి 5 వరకు విశాఖలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన ఐఐఏఎమ్‌లో పుస్తకావిష్కరణ, ‘ప్రైడ్ ఆఫ్ నేషన్’ అవార్డుల ప్రదానం, బాలాజీ హైఫీల్డ్స్ స్కూల్ వార్షికోత్సవం, అమలాపురంలో జరిగే ‘వరల్డ్ తెలుగు కాన్‌క్లేవ్’ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మార్చి 5న తిరిగి భువనేశ్వర్ వెళ్తారు.


