News March 2, 2025

కలగానే జక్రాన్పల్లిలో ఎయిర్ పోర్ట్ నిర్మాణం!

image

నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లిలో ఎయిర్ పోర్ట్ నిర్మాణం కలగానే మిగిలిపోతోంది. 2 రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం వరంగల్ ఎయిర్ పోర్టుకు అనుమతులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. జిల్లాలో కూడా ఎయిర్ పోర్టు నిర్మాణానికి త్వరగా అడుగులు పడేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వాసులు కోరుతున్నారు. ఇప్పటికే ఎయిర్పోర్ట్ అథారిటీ ప్రతినిధుల బృందం జిల్లాలో పర్యటించి ఎయిర్ పోర్టు స్థలాన్ని పరిశీలించిన విషయం తెలిసిందే.

Similar News

News February 28, 2026

NLG: ఇంటర్ పరీక్షలు.. నాలుగో రోజు 281 మంది గైర్హాజరు

image

జిల్లాలో శనివారం జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 281 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డిఐఈఓ దస్రూనాయక్ తెలిపారు. జనరల్ విభాగంలో మొత్తం 11,050, మంది విద్యార్థులకు గాను 10, 839మంది హాజరుకాగా, 211 మంది గైర్హాజరయ్యారు. వొకేషనల్ విభాగంలో 1,884 మంది విద్యార్థులకు గాను 1,814 మంది హాజరుకాగా, 70 మంది గైర్హాజరయ్యారు.

News February 28, 2026

వరంగల్: ఆనాటి జ్ఞాపకాలు గుర్తు చేసిన చిన్నోడు

image

జాతీయ సైన్స్‌ దినోత్సవం సందర్భంగా ఖిలా వరంగల్‌లో ఓ అరుదైన దృశ్యం కనిపించింది. ఓ ప్రభుత్వ పాఠశాల విద్యార్థి తాను తయారు చేసిన సైన్స్‌ నమూనాను సైకిల్‌పై తీసుకెళ్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు. 1960వ దశకంలో భారత తొలి రాకెట్‌ భాగాలను సైకిల్‌పై తరలించిన చారిత్రక ఘట్టాన్ని ఈ దృశ్యం గుర్తుచేసింది. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే నిర్మితమవుతుందన్న మాటను చిన్నారి ఆసక్తి నిజం చేస్తోందని స్థానికులు కొనియాడారు.

News February 28, 2026

రూ.2,300 కోట్ల ప్రాజెక్టుకు మంత్రి లోకేశ్ శంకుస్థాపన

image

AP: అనకాపల్లి(D) రాంబిల్లి(M) సీతాపాలెం సెజ్‌లో బ్లూ జెట్ హెల్త్ కేర్ కంపెనీ నిర్మాణానికి మంత్రి లోకేశ్ శంకుస్థాపన చేశారు. ₹2,300Cr పెట్టుబడితో చేపడుతున్న ఈ అధునాతన ఫార్మాస్యూటికల్ ఇంటర్మీడియట్స్& CDMO ఫెసిలిటీ ఉత్తరాంధ్ర ఇండస్ట్రీయల్ గ్రోత్‌కు బూస్ట్ ఇస్తుందని పేర్కొన్నారు. దీని ద్వారా 1,750 మందికి ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సంస్థలు క్యూ కడుతున్నాయన్నారు.