News April 9, 2024
కలపర్రు టోల్ గేట్ వద్ద పట్టుబడ్డ ఆభరణాల వివరాలు

పెదపాడు మండలం కలపర్రు టోల్ గేటు వద్ద సోమవారం పట్టుబడిన నగదు వివరాలను అధికారులు వెల్లడించారు. ఒక వాహనంలో రూ.15,52,300 నగదు మరో వాహనంలో 16.528 కేజీల బంగారు ఆభరణములు, 31.042 కేజీల వెండి ఉందన్నారు. నగదు, ఆభరణాలకు సంబంధించిన యజమానులు సరైన పత్రాలను జిల్లా త్రిసభ్య కమిటీ వారికి సమర్పించాలన్నారు. పరిశీలించిన తర్వాత నగదు, ఆభరణాలు తిరిగి అందజేయడం జరుగుతుందని స్పష్టం చేశారు.
Similar News
News July 9, 2025
పశ్చిమ గోదావరి రెడ్ క్రాస్ సొసైటీకి ఉత్తమ జిల్లా అవార్డు

పశ్చిమ గోదావరి జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ 2022-2023 సంవత్సరానికిగాను ఉత్తమ జిల్లా అవార్డును అందుకుంది. బుధవారం విజయవాడలో జరిగిన రాష్ట్ర వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా జిల్లా ఛైర్మన్ డా. భద్రిరాజు ఈ అవార్డును స్వీకరించారు. ఈ పురస్కారం జిల్లాకు గర్వకారణమని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు.
News July 9, 2025
‘పేదలను ఆదుకునేందుకు శ్రీమంతులు ముందుకు రావాలి’

పీ-4 కార్యక్రమంలో భాగంగా మార్గదర్శకుల నమోదు ప్రక్రియపై అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని జేసీ రాహుల్ అన్నారు. మంగళవారం జేసీ ఛాంబర్లో జరిగిన సమావేశంలో మాట్లాడారు. పేద వర్గాలను ఆదుకునేందుకు జిల్లాలోని శ్రీమంతులు స్వచ్ఛందంగా ముందుకు రావాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా మార్గ దర్శకులుగా రిజిస్టర్ చేసుకొని బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవచ్చునని అన్నారు.
News July 9, 2025
ఈనెల 10న రెండో విడత తల్లికి వందనం: కలెక్టర్ నాగరాణి

సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో నూరు శాతం అడ్మిషన్స్ జరగాలని, వసతి గృహాల్లో మెరుగైన మౌలిక వసతులను కల్పిస్తున్నామని కలెక్టర్ నాగరాణి అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లో జరిగిన అధికారుల సమీక్షలో ఆమె మాట్లాడారు. ఈనెల 10న రెండో విడత తల్లికి వందనం సొమ్మును విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేయనున్నారని, ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తల్లికి వందనం కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు.