News September 29, 2024
కలసపాడు: రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి మృతి

మండలంలోని ఎగువ రామాపురానికి చెందిన బీటెక్ విద్యార్థి తమిళనాడు రాష్ట్రంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అన్నదమ్ములు ఇద్దరు బైక్‌పై వెళ్తుండగా లారీ ఢీకొనడంతో తమ్ముడు అర్జున్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. అన్న అరవింద రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. విద్యార్థి మృతితో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 29, 2025
కడప: న్యూ ఇయర్ వేళ బేకరీలపై నిఘా

నూతన సంవత్సరం సందర్భంగా కడప నగరంలోని పలు బేకరీలు, కేక్ తయారీ కేంద్రాలపై మున్సిపల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. కమిషనర్ మనోజ్ రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం హెల్త్ ఆఫీసర్ డా.రమేశ్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ హరిణి కేక్ తయారీ విధానాన్ని పరిశీలించారు. తయారీ కేంద్రాల్లో శుభ్రత, నాణ్యత ప్రమాణాలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని యాజమాన్యాలను హెచ్చరించారు. ఈ తనిఖీల్లో శానిటరీ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.
News December 29, 2025
మారనున్న కడప జిల్లా స్వరూపం

రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల పునర్విభజన నేపథ్యంలో కడప జిల్లా స్వరూపం మారనుంది. ప్రస్తుతం 36 మండలాలుగా ఉన్న జిల్లా 40 మండలాలుగా మారనుంది. కొత్తగా అన్నమయ్య జిల్లాలోని రాజంపేట, టి.సుండుపల్లి, వీరబల్లి, నందలూరు మండలాలతో రాజంపేట నియోజకవర్గాన్ని కడప జిల్లాలోని విలీనం చేశారు.
News December 29, 2025
ఒంటిమిట్ట కోదండరాముడు మనకే..!

రాష్ట్రంలో జిల్లాల విభజనలో భాగంగా కొన్ని రోజులుగా ఒంటిమిట్ట, సిద్దవటం మండలాలను అన్నమయ్యనా లేక కడప జిల్లాలో కొనసాగించాలా అన్న సందిగ్ధతకు సోమవారం పులిస్టాప్ పడింది. సోమవారం రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో ఎట్టకేలకు రాజంపేట నియోజకవర్గాన్ని కడప జిల్లాలో విలీనం చేస్తూ ఆమోదం తెలిపింది. దీంతో శ్రీ కోదండరామాలయం ఉన్న ఒంటిమిట్ట మండలం కడప జిల్లాలో కొనసాగుతుండడంపై జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


