News September 8, 2025

కలికిరికి మాజీ సీఎం రాక నేడు

image

మాజీ సీఎం, బీజేపీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కలికిరికి ఇవాళ రానున్నారు. రెండు రోజులు ఇక్కడే బస చేస్తారని ఆయన పీఏ కృష్ణప్ప తెలిపారు. సోమ, మంగళవారాల్లో లోకల్‌గా జరిగే పలు ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారన్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు బయలుదేరి రేణిగుంట విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌ వెళ్తారన్నారు.

Similar News

News September 8, 2025

ఈ సూపర్ కాప్ గురించి తెలుసా?

image

మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ చార్లెస్ శోభరాజ్‌ను రెండు సార్లు పట్టుకున్న ముంబై లెజెండరీ పోలీస్ మధుకర్ బాపూరావు జెండే గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. తన తెలివితేటలు, ధైర్యం, ఓపికతో ఎన్నో క్లిష్టమైన కేసులను పరిష్కరించడం విశేషం. దీంతో ఆనాటి పీఎం రాజీవ్ గాంధీ స్వయంగా వచ్చి జెండేను ప్రశంసించారు. ఆయన జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘ఇన్‌స్పెక్టర్ జెండే’ సినిమా ఈనెల 5న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది.

News September 8, 2025

రాజీ దారిలోనే కేసుల పరిష్కారం: వరంగల్ సీపీ

image

ఈనెల 13న జరగనున్న జాతీయ మెగా లోక్ అదాలత్ సందర్భంగా కక్షిదారులు తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ పిలుపునిచ్చారు. ఈరోజు సీపీ మాట్లాడుతూ.. రాజీ ద్వారా పరిష్కరించగల కేసుల్లో కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని, డబ్బును వృథా చేసుకోవద్దని సూచించారు. “రాజీయే రాజమార్గం” అని ఆయన స్పష్టం చేస్తూ, చిన్న కేసులను రాజీ ద్వారా సులభంగా పరిష్కరించుకోవచ్చన్నారు.

News September 8, 2025

14న లోక్ అదాలత్.. సద్వినియోగం చేసుకోండి- SP జానకి

image

త్వరిత న్యాయం కోసం జాతీయ మెగా లోక్ అదాలత్ ఈనెల 14న నిర్వహిస్తున్నట్లు మహబూబ్ నగర్ ఎస్పీ డి.జానకి తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ.. ‘రాజీయే రాజమార్గం.. చిన్న చిన్న కేసులతో కక్షలు పెంచుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని, డబ్బును వృథా చేసుకోవద్దని, జుడీషియల్ డిపార్ట్మెంట్ ఇచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి, ఈ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని’ అన్నారు.