News April 16, 2025
కలికిరి: పోక్సో కేసులో నిందితుడు అరెస్ట్: సీఐ

ఇటీవల 14ఏళ్ల బాలికపై హరి(63) బలాత్కారం చేశాడనే ఫిర్యాదుతో కలికిరి పోలీస్ స్టేషన్‌లో పోక్సో కేసు నమోదు చేశారు. మదనపల్లి ఎస్డీపీవో ఆధ్వర్యంలో తట్టివారిపల్లి వద్ద ఉన్న నిందితుడిని సీఐ రెడ్డి శేఖర్ రెడ్డి తమ సిబ్బందితో వెళ్లి అరెస్టు చేసి సోమవారం సాయంత్రం వాల్మీకిపురం కోర్టులో హాజరుపరిచారు. జడ్జి 14 రోజులు రిమాండ్ విధించారని సీఐ తెలిపారు.
Similar News
News November 14, 2025
జూబ్లీహిల్స్: 56 మంది డిపాజిట్ గల్లంతు!

ప్రతిష్ఠాత్మక జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ప్రధానంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష BRS మధ్యే పోరు నడిచింది. కాగా మొత్తం 58 మంది ఈ ఎన్నికలో పోటీ చేయగా నవీన్ యాదవ్, మాగంటి సునీత మాత్రమే డిపాజిట్ దక్కించుకున్నారు. ఇందులో నవీన్ యాదవ్ గెలుపొందగా సునీత రెండో స్థానంలో నిలిచారు. BJP అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి సహా 56 మంది డిపాజిట్ గల్లంతైంది. చిన్న పార్టీలు, స్వతంత్రుల్లో ఒక్కరికి కూడా 250 ఓట్లు దాటలేదు.
News November 14, 2025
పెద్దపల్లి: యార్డులో నేడు పత్తి రేటు ఇలా..!

పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం పత్తికి గరిష్ఠంగా రూ.6,755(క్వింటాల్), కనిష్ఠంగా రూ.5,452, సగటుగా రూ.6,511ల ధర పలికినట్లు మార్కెట్ ఇన్ఛార్జ్ మనోహర్ తెలిపారు. పెద్దపల్లి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 376 మంది రైతులు మొత్తం 953.37 క్వింటాళ్ల పత్తిని విక్రయించగా, మార్కెట్ యార్డులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా లావాదేవీలు సజావుగా సాగాయన్నారు.
News November 14, 2025
BRS కంచుకోటను బద్దలు కొట్టిన న‘విన్’

హైదరాబాద్ అంటే BRS.. BRS అంటే హైదరాబాద్ అని ఆ పార్టీ నేతలు గొప్పగా చెప్పుకుంటారు. కానీ, జూబ్లీ బైపోల్‌లో కాంగ్రెస్ విజయంతో గులాబీ కంచుకోట బీటలువారింది. ఎగ్జిట్ పోల్స్‌లో అంచనాలను మించి నవీన్ యాదవ్ భారీ మెజార్టీని సాధించారు. ఏ ఒక్క రౌండ్‌లో BRS ఆధిక్యం చూపలేకపోయింది. సిటీలో జరిగిన రెండు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయకేతనం ఎగరవేయడం విశేషం. న‘విన్’తో రాజధానిలో హస్తానికి మరింత బలం పెరిగింది.


