News March 20, 2025
కలిదిండి: గేట్లో 9వ ర్యాంకు సాధించిన సాయిచరణ్

కలిదిండి(M) ఆరుతెగలపాడు గ్రామానికి చెందిన చిలుకూరి సాయిచరణ్ ఆల్ ఇండియా గేట్ ప్రవేశ పరీక్షలో 9వ ర్యాంకు సాధించి సత్తా చాటాడు. గతేడాది కాకినాడ JNTUలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన సాయిచరణ్.. గేట్ ప్రవేశ పరీక్ష కోసం హైదరాబాద్‌లో శిక్షణ తీసుకున్నాడు. తొలి ప్రయత్నంలోనే 9వ ర్యాంకు సాధించడం సంతోషంగా ఉందని సాయిచరణ్ తెలిపారు. ఐఐటీ చదవాలన్న తన ఆశయానికి తండ్రి కిశోర్, తల్లి పల్లవి ఎంతో ప్రోత్సాహం ఇచ్చారన్నారు.
Similar News
News November 7, 2025
మల్యాల: ‘రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి’

మల్యాల మం. రామన్నపేట, పోతారం, రాజారం గ్రామాల ప్యాడీ కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ B.S.లత పరిశీలించారు. కేంద్రాల్లో తూకపు, తేమ యంత్రాలు, టార్పాలిన్లు, క్లీనర్స్ అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా సదుపాయాలు కల్పించాలని సూచించారు. A గ్రేడ్‌కు రూ.2389, B గ్రేడ్‌కు రూ.2369 మద్దతు ధర అని తెలిపారు. ఇబ్బందులు ఎదురైతే టోల్ ఫ్రీ నంబర్ 18004258187ను సంప్రదించాలన్నారు.
News November 7, 2025
క్షమాపణలు చెప్పిన రిలయన్స్, స్కోడా.. ఎందుకంటే?

ఏదైనా భారీ తప్పిదం జరిగినప్పుడు కంపెనీలు తమ కస్టమర్లకు క్షమాపణలు చెప్పడం సహజమే. కానీ ఒకేసారి పలు కంపెనీలు బహిరంగంగా క్షమాపణలు చెప్పడం చర్చనీయాంశమవుతోంది. అయితే సరికొత్త సోషల్ మీడియా మార్కెటింగ్ ట్రెండ్‌ను ఫాలో అవుతూ సరదాగా ట్వీట్ చేశాయా కంపెనీలు. ‘నాణ్యమైనవి చౌకగా ఇస్తున్నందుకు’ రిలయన్స్, సేఫ్టీలో కాంప్రమైజ్ కానందుకు స్కోడా & ఫోక్స్ వాగన్ కంపెనీలు క్షమాపణలు చెప్పాయి.
News November 7, 2025
ఉలవపాడు: రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం

ఉలవపాడు మండలం చాగల్లు–వీరేపల్లి మధ్య రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి గాయత్రి మిల్క్ వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో పాల వాహనం డ్రైవర్ రాకొండి దుర్గా మహేష్ (25) అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిది మద్దిపాడు మండలం వెల్లంపల్లిగా స్థానికులు గుర్తించారు. ఇంకా వివాహం కాలేదని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని ఉలవపాడు సీహెచ్‌సీకి తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ అంకమ్మరావు తెలిపారు.


