News September 5, 2024
కలివెలపాలెం సర్పంచ్ చెక్ పవర్ రద్దు
నెల్లూరు రూరల్ కలివెలపాలెం గ్రామ సర్పంచ్ పార్లపల్లి మధుసూదన్ రెడ్డి చెక్ పవర్‌ను మూడు నెలల పాటు రద్దు చేశారు. ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారి సుస్మిత ఆదేశాలు జారీ చేశారు. నిధుల దుర్వినియోగానికి సంబంధించి మధుసూదన్ రెడ్డిపై అనేక ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఉన్నతాధికారులు విచారణ జరిపారు. డివిజనల్ పంచాయతీ అధికారి ఇచ్చిన నివేదిక ఆధారంగా చెక్ పవర్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Similar News
News January 13, 2025
మనుబోలు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం
మనుబోలు మండలం, కాగితాలపూరు వద్ద ఆదివారం రాత్రి ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. నెల్లూరు నుంచి గూడూరు వైపు బైక్‌పై వెళ్తున్న ఇద్దరిని వెనుక నుంచి ఓ లారీ ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న మనుబోలు పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News January 13, 2025
నెల్లూరు: భోగి మంట వేస్తున్నారా..?
సంక్రాంతి వేడుకల్లో మొదటి రోజు భోగి. తెల్లవారుజామున భోగి మంటలు వేయడంతో పండగ సెలబ్రేషన్స్ మొదలవుతాయి. ఇంటింటా ఉత్సాహంగా భోగి మంటలు వేసుకుంటారు. మరి మీరూ నేడు భోగి మంట వేస్తున్నారా? మీ సెలబ్రేషన్స్‌ను వే2న్యూస్‌లో చూడాలనుకుంటున్నారా? అయితే మీ భోగి మంటను వీడియో తీసి ఈ నంబర్ 73311 61607కు వాట్సాప్ చేయండి. మీ గ్రామం, మండలం పేర్లు తప్పక పంపండి. మేము పబ్లిష్ చేస్తాం.
News January 13, 2025
నెల్లూరు జిల్లా వాసులకు సంక్రాంతి శుభాకాంక్షలు
జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ నెల్లూరు జిల్లా వాసులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి పండుగను జిల్లా వాసుల సుఖసంతోషాలతో జరుపుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఇంట సిరి సంపదలు, భోగభాగ్యాలు కలగాలని ఆమె ఆకాంక్షించారు.