News November 26, 2025
కలెక్టరేట్‌కు ప్రభుత్వం ఒకపైసా మంజూరు చేయలేదు: శ్రీకాంత్ రెడ్డి

రెండేళ్ల క్రితమే రూ.100 కోట్ల నిధులతో అప్రూవ్ అయిన రాయచోటి కలెక్టరేట్‌కు కూటమి ప్రభుత్వం ఒక్కపైసా మంజూరు చేయలేదని YCP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. అమరావతి నిర్మాణానికి పెట్టే ఖర్చులో 0.1 శాతం నిధులను కూడా ఈ ప్రాంత అభివృద్ధికి ఖర్చు పెట్టక పోవడం ఏంటని ప్రశ్నించారు. స్వార్థం లేకుండా, కేవలం రాయచోటిని మంచి పట్టణంగా తీర్చిదిద్దడానికి కృషి చేశానన్నారు.
Similar News
News November 26, 2025
Official: అహ్మదాబాద్‌లో కామన్ వెల్త్ గేమ్స్

2030 కామన్‌వెల్త్ గేమ్స్ ఆతిథ్య నగరంగా అహ్మదాబాద్ అధికారికంగా ఖరారైంది. స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో నిర్వహించిన కామన్‌వెల్త్ స్పోర్ట్ జనరల్ అసెంబ్లీలో 74 దేశాల ప్రతినిధులు ఇండియా బిడ్‌కు ఆమోదం తెలిపారు. ఇందులో 15-17 క్రీడలు ఉండనున్నాయి. వచ్చే ఏడాది గ్లాస్గోలో జరిగే గేమ్స్‌లో మాత్రం 10 స్పోర్ట్స్ ఉండనున్నాయి. కాగా 2030లో జరగబోయేవి శతాబ్ది గేమ్స్ కావడం గమనార్హం.
News November 26, 2025
శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ పడొద్దు: ఎస్పీ

జిల్లాలో శాంతిభద్రతలకు పరిరక్షించడంలో పోలీసు యంత్రాంగం సమర్థంగా విధులు నిర్వహించాలని ఎస్పీ సునీల్ షోరాన్ సూచించారు. బుధవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో పోలీస్ అధికారులతో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాలు, సైబర్ క్రైమ్‌పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించారు.
News November 26, 2025
విశాఖ రైల్వే జోన్‌కు ‘గెజిట్’ గండం..?

దశాబ్దాల పోరాటంతో సాకారమైన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు అధికారిక ‘గెజిట్’ విడుదల కాకపోవడంతో నూతన జోన్‌గా రూపాంతరం చెందడం లేదు. GM ఆఫీసు, అధికారుల కేటాయింపు జరిగినా.. గెజిట్ రాక డివిజన్ ఇంకా ఈస్ట్ కోస్ట్ జోన్‌లోనే కొనసాగుతోంది. ఉద్యోగుల సంఖ్య వంటి కీలక అంశంపైనా స్పష్టత రావడం లేదు. అయితే ఈస్ట్ కోస్ట్ పరిధిలో కొత్తగా ఏర్పడిన రాయగఢ డివిజన్ పనులను మాత్రం రైల్వే శాఖ చురుగ్గా పూర్తి చేస్తుండటం గమనార్హం.


