News April 6, 2025
కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

శ్రీసత్యసాయి జిల్లా కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల వారి సమస్యలపై వినతులు స్వీకరిస్తామన్నారు. వాటిని సంబంధిత అధికారులకు పంపి సమస్యల పరిష్కారాలకు చేస్తామన్నారు.
Similar News
News September 19, 2025
చొప్పదండి ఎమ్మెల్యే రూట్ మ్యాప్

మల్యాల మం.ల కేంద్రంలో శుక్రవారం చొప్పదండి MLA మేడిపల్లి సత్యం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 1 PMకి కొండగట్టులో అంగన్వాడీ భవనం శంకుస్థాపన, 1:30 PMకి నూకపల్లిలో పలు సంఘం భవనాల శంకుస్థాపన, 2.30 PMకి ముత్యంపేటలో మహిళా బిల్డింగ్ శంకుస్థాపన, 3 PMకి మల్యాలలో చెక్కుల పంపిణీ, 4 PMకి మల్యాల అంగన్వాడీ భవనం శంకుస్థాపన, 4:30 PMకి తక్కళ్లపల్లి అంగన్వాడీ భవనం శంకుస్థాపన చేయనున్నారు.
News September 19, 2025
మొక్కజొన్నలో పాము పొడ తెగులును ఎలా గుర్తించాలి?

పాము పొడ తెగులు ముందుగా నేలకు దగ్గరగా ఉండే మొక్కజొన్న మొక్కల కింది ఆకులపై సోకుతుంది. తర్వాత పై ఆకులకు, కాండానికి వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన మొక్కల ఆకులు, కాండంపై బూడిద, గోధుమ వర్ణపు మచ్చలు ఒకదాని తర్వాత ఒకటి ఏర్పడి.. చూడటానికి పాముపొడ వలే కనిపిస్తాయి. కాండంపై ఏర్పడిన తెగులు లక్షణాల వల్ల కణుపుల వద్ద మొక్కలు విరిగి నేలపై పడిపోతాయి. దీని వల్ల మొక్కల సంఖ్య తగ్గి పంట దిగుబడి పడిపోతుంది.
News September 19, 2025
HYD- నల్లగొండ.. 74 కొట్టుకుపోయిన డెడ్‌బాడీ

అఫ్జల్‌సాగర్ నాలాలో గల్లంతైన మాన్గార్ బస్తీ యువకుడు అర్జున్ (26) మృతదేహం నల్లగొండ జిల్లా వలిగొండ వద్ద మూసీలో కనిపించింది. ఈ నెల 14న అర్జున్, రామా గల్లంతయ్యారు. 5 రోజుల తర్వాత నల్లగొండ మూసీ నదిలో డెడ్‌బాడీ ఉన్నట్లు సిబ్బంది కనుగొన్నారు. అతడి డెడ్‌బాడీ 74 కిలో మీటర్ల దూరం కొట్టుకుపోయింది. అర్జున్‌కు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు.