News December 29, 2025

కలెక్టరేట్‌లో 221 అర్జీలపై కలెక్టర్ ఆరా!

image

భీమవరం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె ప్రజల నుంచి 221 అర్జీలను స్వీకరించారు. అర్జీదారులకు సంతృప్తి కలిగేలా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. తమ పరిధిలో లేని అర్జీలను సంబంధిత శాఖలకు పంపించాలని సిబ్బందికి సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Similar News

News December 30, 2025

కలెక్టర్‌కి పదోన్నతి.. అధికారుల అభినందనల వెల్లువ

image

పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణికి కార్యదర్శిగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా సోమవారం పీజీఆర్ సమావేశంలో జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆమెకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. డీఆర్వో శివనారాయణ రెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు కలెక్టర్‌ను కలిసి అభినందనలు తెలియజేశారు. మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు.

రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలి: జేసీ

image

రబీ సాగులో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగినంత యూరియా అందుబాటులో ఉంచాలని జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం భీమవరం కలెక్టరేట్ నుండి రైతు ప్రతినిధులు, అధికారులతో గూగుల్ మీట్ ద్వారా ఆయన సమీక్షించారు. అన్ని మండలాల్లో అవసరమైన మేర నిల్వలు ఉండేలా చూడాలని, పంపిణీలో పారదర్శకత పాటించాలని సూచించారు. సాగు అవసరాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.