News September 1, 2025

కలెక్టరేట్ ప్రజా సమస్యల వేదికకు 174 అర్జీలు

image

పుట్టపర్తి కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మొత్తం 174 అర్జీలు అందినట్లు కలెక్టర్ కార్యాలయ సిబ్బంది తెలిపారు. ఇందులో డివిజన్ల వారీగా చూస్తే పుట్టపర్తి- 67, పెనుకొండ- 51, ధర్మవరం- 41, కదిరి- 15 అర్జీలను స్వీకరించడం జరిగిందని తెలిపారు. ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.

Similar News

News September 4, 2025

ఎంబీఏ లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్‌మెంట్‌లో ప్రవేశాలు

image

ఏయూలో ఎంబీఏ లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్‌మెంట్‌లో రెండు సంవత్సరాల కోర్స్ ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. సెల్ఫ్ సపోర్టు విధానంలో నిర్వహించే ఈ కోర్సులో 60 మందికి ప్రవేశం కల్పిస్తారు. రక్షణ రంగ ఉద్యోగులకు వార్షిక ఫీజుగా రూ.40 వేలు, ఇతరులకు రూ.60 వేలుగా నిర్ణయించారు. ఆసక్తి కలిగిన వారు 18వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.

News September 4, 2025

NTR: రేపు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం

image

ఎన్టీఆర్ జిల్లాలో ఖరీఫ్-2025 సీజన్‌కు సంబంధించి ఎరువుల సరఫరా, ఇతర సమస్యలపై శుక్రవారం డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా. జి. లక్ష్మీశా గురువారం తెలిపారు. ఈ కార్యక్రమం ఉదయం 8.30 నుంచి 10.30 గంటల వరకు జరుగుతుందన్నారు. రైతులు తమ సమస్యలను నేరుగా కలెక్టర్‌కు తెలియజేయవచ్చని చెప్పారు.

News September 4, 2025

దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేయాలి: BHPL కలెక్టర్

image

వర్షాలు, వరదల వల్ల దెబ్బతిన్న రోడ్ల మరమ్మతు వెంటనే చేపట్టాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. గురువారం సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణకు త్వరగా ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని చెప్పారు. నష్టపరిహారం పనులు త్వరగా పూర్తి చేయడానికి అంచనాలు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు.