News March 29, 2025

కలెక్టరేట్ రెవెన్యూ భవన్లో ఉగాది వేడుకలు నిర్వహిస్తున్నాం: కలెక్టర్

image

అనంతపురం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో ఆదివారం నాడు శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు-2025 కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వినోద్ కుమార్ శనివారం తెలిపారు. కార్యక్రమం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. ఉగాది వేడుకలకు ప్రజాప్రతినిధులు, జిల్లా స్థాయి ప్రభుత్వ అధికారులు విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు.

Similar News

News October 22, 2025

సోలార్ ప్రాజెక్టు కోసం భూముల గుర్తింపు సర్వే పూర్తి చేయాలి: కలెక్టర్

image

సోలార్ ప్రాజెక్టు కోసం భూముల గుర్తింపు సర్వే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. మంగళవారం అనంతపురం కలెక్టరేట్లో సోలార్ ప్రాజెక్టు కోసం భూసేకరణపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కంబదూరు మండలంలో ఏర్పాటు చేస్తున్న సోలార్ ప్రాజెక్టు కోసం 4,292.28 ఎకరాలు గుర్తించామని, పెండింగ్‌లో ఉన్న 984.53 ఎకరాల భూముల గుర్తింపు సర్వే పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.

News October 21, 2025

సర్ధార్@150 యూనిటీ మార్చ్‌ను విజయవంతం చేయండి: కలెక్టర్

image

సర్ధార్ @150 యూనిటీ మార్చ్‌ను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. మంగళవారం అనంతపురం కలెక్టరేట్‌లో సర్ధార్ 150@ యూనిటీ మార్చ్ ఏక్ భారత్ ఆత్మనిర్భర్ భారత్ పాదయాత్ర పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినం పురస్కరించుకొని ఈ నెల 31న నిర్వహించబోయే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని యువతీ, యువకులకు సూచించారు.

News October 21, 2025

‘రిజర్వేషన్ అమలులో మహా మోసం’

image

రిజర్వేషన్ల అమలులో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు మహా మోసం జరిగిందని రిజర్వేషన్ సాధికార సమితి అధ్యక్షుడు జీవీ ఉజ్వల్ ఆరోపించారు. అనంతపురంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. డీఎస్సీ నియామకాలలో రిజర్వేషన్ కటాఫ్ కంటే ఓపెన్ కటాఫ్ తక్కువ ఉండటం విడ్డూరంగా ఉందన్నారు. జీవో 77లో ఓపెన్ క్యాటగిరీ పోస్టులు నింపిన తర్వాతే రిజర్వేషన్ పోస్టులు భర్తీ చేయాలనే నిబంధన స్పష్టంగా ఉందన్నారు.