News December 30, 2025
కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపిన హిట్&రన్ బాధిత కుటుంబాలు

పార్వతీపురం కలెక్టర్ ప్రభాకర్ రెడ్డికి హిట్&రన్ బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ఆయనను కలిశారు. రోడ్డున పడ్డ తమ కుటుంబాలకు ఆర్థిక సహాయం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ‘కలెక్టర్ చొరవతో మళ్లీ మా కుటుంబాలలో వెలుగు వచ్చింది’ అని బాధిత కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. మోటార్ వెహికల్ యాక్సిడెంట్ చట్టం ప్రకారం బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందజేశామని కలెక్టర్ వెల్లడించారు.
Similar News
News January 10, 2026
బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి హత్య

బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై <<18797338>>దాడులు<<>> కొనసాగుతూనే ఉన్నాయి. 20రోజుల వ్యవధిలో మరో హిందువు హత్యకు గురయ్యాడు. సునంగంజ్ జిల్లా భంగదొహోర్‌లో ఈ దారుణం జరిగింది. తమ కుమారుడిని కొందరు విచక్షణారహితంగా కొట్టారని, ఆ తర్వాత అమిరుల్ ఇస్లామ్ అనే వ్యక్తి విషమిచ్చాడని కుటుంబం ఆరోపిస్తోంది. గురువారం ఈ దాడి జరగ్గా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యువకుడు చనిపోయాడు. మృతుడు జై మహాపాత్రగా గుర్తించారు.
News January 10, 2026
పట్టిసీమలో కోడిపందేల బరులు ధ్వంసం

సంక్రాంతి పండుగ వేళ కోడిపందేలు, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు పోలీస్ యంత్రాంగం నిఘా పెంచింది. శనివారం ఎస్సై పవన్ కుమార్ ఆధ్వర్యంలో పట్టిసీమలో కోడిపందేల బరులను ధ్వంసం చేశారు. పండుగ ముసుగులో జూద క్రీడలు నిర్వహిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని, ఎట్టి పరిస్థితుల్లోనూ నిబంధనలు అతిక్రమించకూడదని ఈ సందర్భంగా ఎస్సై హెచ్చరించారు.
News January 10, 2026
నన్ను ఎంపిక చేయకపోవడాన్ని స్వాగతిస్తున్నా: గిల్

T20 WCకు తనను ఎంపిక చేయకపోవడంపై భారత టెస్ట్, వన్డే జట్ల కెప్టెన్ గిల్ తొలిసారి స్పందించారు. సెలక్టర్ల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. అలాగే WC జట్టుకు విషెస్ తెలిపారు. దేశం తరఫున ఆడుతున్న ప్రతి ప్లేయర్ తన బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తారని, అయితే జట్టును ఎంపిక చేసే నిర్ణయం సెలక్టర్లదే అన్నారు. తాను ఎక్కడ ఉండాలనుకున్నానో అక్కడే ఉన్నానని, తన డెస్టినీ ఎలా ఉంటే అలా జరుగుతుందని వ్యాఖ్యానించారు.


