News June 22, 2024

కలెక్టర్‌గా జిల్లాలో తనదైన మార్క్

image

ఇప్పటి వరకు కర్నూలు జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించిన డా.సృజన తనదైన మార్క్ వేశారు. గత ఎడాది ఏప్రిల్ 11న బాధ్యతలు చేపట్టిన సృజన దాదాపు 15 నెలలపాటు కలెక్టర్‌గా సేవలందించారు. కాగా కలెక్టర్ హోదాలో సృజనకు కర్నూలు జిల్లా తొలి పోస్టింగ్. గతంలో ఆమె తండ్రి బలరామయ్య కూడా ఇదే జిల్లా కలెక్టర్‌గా సేవలందించారు. తండ్రికి తగ్గ కుమార్తెగా సృజన కర్నూలు జిల్లాను అభివృద్ధిలో తనదైన పరిపాలనతో పరుగులు పెట్టించారు.

Similar News

News September 15, 2025

ఉద్యోగాల పేరుతో మోసపోకండి: కర్నూలు SP

image

ఉద్యోగుల పేరుతో నిరుద్యోగులు మోసపోవద్దని.. పోటీ పరీక్షల ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు వస్తాయని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ స్పష్టం చేశారు. ఎస్పీ క్యాంపు కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి 81 ఫిర్యాదులు వచ్చాయన్నారు. వాటిని త్వరగా పరిష్కరిస్తామన్నారు. అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా తదితరులు ఉన్నారు.

News September 15, 2025

నిజంగా రూ.1200కు ఉల్లి కొన్నారా?: SV

image

చంద్రబాబు సర్కారుకు ఉల్లి రైతుల కష్టాలు కనిపించవా? అని వైసీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. కర్నూలు ఎస్వీ కాంప్లెక్స్‌లో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం నిజంగా రూ.1,200తో ఉల్లిని కొనుగోలు చేస్తే రైతులు ఎందుకు రోడ్లపై పడేస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి అధ్వానంగా ఉందని, వారికి మద్దతుగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.

News September 14, 2025

కర్నూలు: ‘ప్రతి ఒక్కరు వ్యాయామం చేయాలి’

image

ప్రతి ఒక్కరు వ్యాయామాలు చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్ పేర్కొన్నారు. ఆదివారం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు కర్నూలులోని కొండారెడ్డి బురుజు వద్ద ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ‘సండేస్ ఆన్ సైక్లింగ్’ కార్యక్రమాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. సైక్లింగ్ వల్ల పర్యావరణానికి ముప్పు ఉండదని, ప్రతి ఆదివారం పోలీసులు సైకిల్ తొక్కాలని పిలుపునిచ్చారు.