News December 18, 2025

కలెక్టర్‌ను వెంటబెట్టుకుని సీఎంను కలిసిన పవన్ కళ్యాణ్

image

కలెక్టర్ల సదస్సు ముగిసిన అనంతరం ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ కలెక్టర్ షాన్‌మోహన్‌తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ను పవన్ ఆప్యాయంగా చేతితో పట్టుకుని సీఎం వద్దకు తీసుకెళ్లడం చర్చనీయాంశమైంది. కలెక్టర్ పనితీరుపై డిప్యూటీ సీఎంకు ఉన్న నమ్మకాన్ని, అభిమానాన్ని ఈ ఘటన ప్రతిబింబిస్తోందని అధికార వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.

Similar News

News December 20, 2025

మల్లాపూర్: శ్రీశైలం సేవకు వెళ్లి మహిళ మృతి

image

మల్లాపూర్ మండలం వెంకట్రావుపేటకి చెందిన మహిళా శ్రీశైలంలో మృతి చెందడంతో విషాదం నెలకొంది. స్థానికులు వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మ్యాడారపు లక్ష్మి వారం రోజుల క్రితం శ్రీశైల దేవస్థానంలో సేవకై, మెట్‌పల్లికి చెందిన బృందంతో వెళ్ళింది. చివరి రోజు ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందినట్లు తెలియడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. మరణానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.

News December 20, 2025

నల్గొండ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

> NLG: పోలీసుల చొరవతో రూ.18 లక్షలు భద్రం
> NLG: అమ్మా సారీ… చనిపోతున్నా..!
> నార్కట్‌పల్లిలో ఉద్రిక్తత
> కట్టంగూరులో పోలీసు బందోబస్తు నడుమ ఉపసర్పంచ్ ఎన్నిక
> చండూరు మిల్లు వద్ద రైతుల నిరసన
> గ్రూప్-3 ఫలితాల్లో సత్తా చాటిన జిల్లావాసులు
> NLG: మారని కొందరు ఖాకీల పని తీరు
> నార్కట్‌పల్లి చెరువుగట్టు ట్రస్ట్ బోర్డు ఏర్పాటుకు కసరత్తు
> NLG: 306 స్థానాల్లో సత్తా చాటిన బీసీలు

News December 20, 2025

కరీంనగర్: జూనియర్ లెక్చరర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

image

కరీంనగర్ బాలుర మైనారిటీ గురుకుల కళాశాలలో ఖాళీగా ఉన్న 1 గణితం జూనియర్ లెక్చరర్ పోస్టుకు ఔట్ సోర్సింగ్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా మైనారిటి అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. దీనికి మ్యాథ్స్ లో పీజీ చేసి 50 శాతం మార్కులుండి బీ.ఎడ్ చేసిన వారు అర్హులని, ధరఖాస్తులు ఈ నెల 29 వరకు కరీంనగర్ మైనారీటీ సంక్షేమ శాఖ కార్యాలయంలో అందజేయాలన్నారు. వివరాలకు 08782957085 లో సంప్రదించగలరు.