News December 18, 2025
కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న చిత్తూరు కలెక్టర్, ఎస్పీ

అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ తుషార్ డూడీ పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా ప్రగతిపై సీఎం సదస్సులో చర్చించారు. జిల్లా అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సీఎం సుదీర్ఘంగా చర్చించి పలు అంశాలపై కలెక్టర్, ఎస్పీకి దిశా నిర్దేశం చేశారు.
Similar News
News December 27, 2025
పక్కా గృహాల నిర్మాణంలో చిత్తూరు జిల్లా టాప్.!

పక్కా గృహాల నిర్మాణంలో చిత్తూరు జిల్లా 77%తో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచింది. జిల్లాలో 72,767 గృహాలు మంజూరవ్వగా ఇప్పటి వరకు 53,466 ఇళ్ల నిర్మాణం పూర్తయ్యింది. ఇందుకుగాను ప్రభుత్వం రూ.1,350 కోట్ల బడ్జెట్ కేటాయించగా, ఇప్పటికే రూ.1,033 కోట్లు ఖర్చు చేశారు. ఇంకా 3,387 ఇళ్లు ప్రారంభం కాలేదు. 739 ఇళ్లు పునాది దశలో, 9,642 గోడల దశలో, 46 పైకప్పు, గోడల దశలో ఉండగా, 1,549 ఇళ్లకు పైకప్పు పూర్తయ్యింది.
News December 27, 2025
కుప్పంలో మహిళను బలవంతంగా లాక్కెళ్లి.. అత్యాచారం.!

కుప్పం మండలంలో ఓ వివాహితపై అత్యాచారం జరిగినట్లు పోలీసులు తెలిపారు. వారి వివరాల మేరకు.. ఓ గ్రామానికి చెందిన మహిళ(22) మేకల కొట్టంలో ఉండగా ముగ్గురు యువకులు ఆమెను బలవంతంగా తీసుకెళ్లారు. వారిలో ఓ యువకుడు అత్యాచారం చేశాడు. దీనిపై బాధిత మహిళ కుప్పం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన 17వ తేదీ జరగ్గా 9 రోజుల తర్వాత బాధితురాలు ఫిర్యాదు చేయడంపై పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
News December 27, 2025
చిత్తూరు: రోడ్డు ప్రమాదంలో తల్లి, కుమారుడి మృతి

ఈ విషాద ఘటన చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలంలో జరిగింది. తిరుపతి-బెంగళూరు హైవేపై వెళ్తున్న కారు కె.పట్నం బ్రిడ్జి వద్ద గురువారం సాయంత్రం లారీని ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించింది. ఈక్రమంలో అదుపు తప్పి లారీని వెనుక వైపు నుంచి కారు ఢీకొట్టింది. కారులో ఉన్న కోమల(40), ఆమె కుమారుడు వర్ధన్ గౌడ్(11) తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రికి తరలించగా చనిపోయారు. మృతదేహాలను శుక్రవారం బంధువులకు అప్పగించారు.


