News April 10, 2025
కలెక్టర్ అన్సారీయాకు ఆహ్వానం

కనిగిరిలోని ఎంవీఆర్ కళ్యాణ మండపంలో ఈ నెల 16న జరిగే అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి ఉత్సవాలకు రావాలని కలెక్టర్ తమీమ్ అన్సారియాను గురువారం రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేశ్, ఆర్యవైశ్య సంఘం నాయకులు కలిసి ఆహ్వానించారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్ అన్సారియా జయంతి ఉత్సవాల్లో తప్పక పాల్గొంటామని హామీ ఇచ్చినట్లు ఆర్యవైశ్య సంఘం నాయకులు తెలిపారు.
Similar News
News January 8, 2026
కే. అగ్రహరంలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్

సంక్రాంతి పండగను పురస్కరించుకొని కె. అగ్రహారం గ్రామంలో గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఈ నెల 10 నుంచి జిల్లాస్థాయి సీటీపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు సునీల్, షరీఫ్ తెలిపారు. పోటీల్లో పాల్గొనదలచిన జట్లు రూ.700 ఎంట్రీ ఫీజు చెల్లించి ఈనెల 8 లోగా పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. విజేతలకు మొదటి బహుమతి రూ.50,116, రెండో బహుమతి 25,116 అందజేస్తామన్నారు.
News January 8, 2026
అర్ధవీడులో జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్

సంక్రాంతి, రిపబ్లిక్ డే పురస్కరించుకుని ఈనెల 10న అర్ధవీడులో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. ఈ టోర్నమెంట్‌లో గెలుపొందిన విజేతలకు మొదటి బహుమతి రూ.25,000, రెండో బహుమతి రూ.15,000 మూడో బహుమతి రూ.8000లు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆసక్తి గలవారు ఈ టోర్నమెంట్‌లో పాల్గొనాలని నిర్వాహకులు కోరారు.
News January 8, 2026
మీ సమస్యలను సీఎంకు చెబుతా: గొట్టిపాటి

ప్రకాశం జిల్లాలోని పొగాకు రైతుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. పలువురు రైతులు మంత్రి గొట్టిపాటికి బుధవారం వినతిపత్రాన్ని అందజేశారు. సిగరెట్లపై ఎక్సైజ్ పన్ను భారీగా పెంచడంతో డిమాండ్ తగ్గి ధరలు పడిపోయే ప్రమాదం ఉందని చెప్పారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాలని రైతులు కోరారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారు.


