News December 26, 2025
కలెక్టర్, ఎస్పీతో సమావేశమైన బాపట్ల ఎంపీ

లోక్‌సభ ప్యానల్ స్పీకర్, బాపట్ల పార్లమెంట్ సభ్యుడు తెన్నేటి కృష్ణ ప్రసాద్ శుక్రవారం బాపట్ల కలెక్టరేట్ వద్ద కలెక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ ఉమామహేశ్వర్‌తో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. జిల్లాలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులు, శాంతిభద్రతల పరిరక్షణపై ఎంపీ సుధీర్ఘంగా చర్చించారు. జిల్లా అభివృద్ధికి పాటుపడాలని సూచించారు.
Similar News
News January 1, 2026
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎంత మద్యం తాగారో తెలుసా?

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మద్యం అమ్మకాలు రికార్డు సృష్టించాయి. డిసెంబరులో రూ.279 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. గత ఏడాది కంటే రూ.51 కోట్లు అదనంగా ఆదాయం రావడం గమనార్హం. పంచాయతీ ఎన్నికలు, నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో 3.20 లక్షల ఐఎంఎల్, 1.44 లక్షల బీరు పెట్టెలు సరఫరా అయ్యాయి. దీంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరింది.
News January 1, 2026
ఖమ్మం: ఎన్పీడీసీఎల్ ఉత్తమ అధికారుల ర్యాంకులు

నవంబర్ నెలకు సంబంధించి ఎన్పీడీసీఎల్ పరిధిలో ఉత్తమ సేవలు అందించిన అధికారుల ర్యాంకులను సంస్థ ప్రకటించింది. అర్బన్ విభాగంలో ఏడీఈ నాగార్జున, ఏఈ తిరుపయ్య, రూరల్ విభాగంలో ఏఈ అనిల్ కుమార్ ర్యాంకులు సాధించారు. సర్కిల్ స్థాయిలో డీఈ రాములు, ఏడీఈ యాదగిరి, రామారావు, ఏఈ రవికుమార్, అబ్దుల్ ఆసీఫ్ ప్రతిభ కనబరిచారు. విధి నిర్వహణలో ప్రతిభ చాటిన అధికారులను పలువురు అభినందించారు.
News January 1, 2026
సంగారెడ్డి: ఆర్థిక పునరావసం కింద దరఖాస్తుల ఆహ్వానం

సంగారెడ్డి జిల్లాలోని ట్రాన్స్‌జెండర్లు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఉపాధి, పునరావాస పథకాల కింద దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి బుధవారం కోరారు. దారిద్య్రరేఖకు దిగువన ఉండి, 18 నుంచి 55 ఏళ్ల లోపు వయసున్న వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు తమ దరఖాస్తులను ఈనెల 9లోగా కలెక్టరేట్‌లోని సంక్షేమ అధికారి కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.


