News May 20, 2024

కలెక్టర్ ప్రెస్ మీట్‌ పై.. పల్నాడు ప్రజల్లో ఉత్కంఠ

image

పల్నాడు జిల్లా కలెక్టర్‌గా లత్కర్ శ్రీకేశ్ బాలాజీ రావు ఆదివారం బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. నేటి ఉదయం 10:30 గంటలకు నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలోని SR శంకరం వీడియో కాన్ఫరెన్స్ హాలులో పాత్రికేయులతో కలెక్టర్ సమావేశం కానున్నట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటికే జరిగిన ఘటనలతో ఎస్పీ సస్పెండ్ కాగా, కలెక్టర్ బదిలీ అయ్యారు. దీంతో ఆయన ఏం మాట్లాడతారనే దానిపై పల్నాడు వాసులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

Similar News

News February 11, 2026

బడ్జెట్ సమావేశాల్లో గుంటూరు గళం వినిపించనుందా?

image

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానుండటంతో గుంటూరు జిల్లాకు చెందిన కూటమి ఎమ్మెల్యేలు అసెంబ్లీలో గళం విప్పేందుకు సిద్ధమయ్యారు. జిల్లాలో ఇద్దరు కీలక మంత్రులు ఉండటంతో పెండింగ్ నిధులు మంజూరవుతాయని ఆశలు వ్యక్తమవుతున్నాయి. సాగునీరు, తాగునీటి సమస్యలు, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, డ్రైనేజ్, వీధి కుక్కల నియంత్రణ, ఆసుపత్రులు, రోడ్ల అభివృద్ధికి నిధులు కేటాయించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

News February 11, 2026

సేవా రంగంలో గుంటూరు టాప్.. మిగతావాటిలో వెనుకబాటు

image

సేవా రంగంలో గుంటూరు జిల్లా 97 స్కోరుతో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచి ‘A+’ గ్రేడ్ సాధించింది. కానీ, టీనేజ్ గర్భధారణల్లో (8-10%) జిల్లా ఆందోళనకర స్థాయిలో ఉండటం గమనార్హం. పదో తరగతి అసెస్‌మెంట్‌లోనూ విద్యార్థులు C, D గ్రేడ్లకే పరిమితమయ్యారు. మరోవైపు, రైల్వే బ్రిడ్జిల (ROB) పనులు నత్తనడకన సాగుతున్నాయి. భూసేకరణ సమస్యలతో జాప్యం జరుగుతోంది. వీటిపై దృష్టి సారించకపోతే ఇబ్బందులు తప్పవు.

News February 11, 2026

GNT: ఇంటర్నెట్ భద్రత పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్

image

సేఫర్ ఇంటర్నెట్ డే 2026 సందర్భంగా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, జేసీ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలి, నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్‌.ఐ.సీ) బృందం సమక్షంలో మహత్తరమైన సేఫర్ ఇంటర్నెట్ డే 2026 పోస్టర్‌ విడుదల చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఇంటర్నెట్ బాధ్యతాయుత వినియోగం పై అవగాహన పెంచే సందేశాలు పోస్టర్‌లో ఆకర్షణీయంగా ముద్రించడం జరిగిందన్నారు.