News December 9, 2025

కలెక్టర్ సార్.. శ్రీకాళహస్తిలో శ్మశానాన్నీ వదలడం లేదు..!

image

శ్రీకాళహస్తిలో ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఇక్కడి ఇసుకకు గిరాకీ ఎక్కువగా ఉండడంతో చెన్నైకు లారీలతో తరలిస్తున్నారు. శుకబ్రహ్మ ఆశ్రమం వద్ద మొదలు పెడితే తొట్టంబేడు చివరి వరకు ఎక్కడో ఒకచోట ఇసుక తవ్వతూనే ఉన్నారు. చివరకు శ్మశానంలో సైతం తవ్వకాలు చేస్తున్నారు. మనిషి అస్తిపంజరాలను సైతం తవ్వేసి ఇసుక తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. దీనిపై తిరుపతి కలెక్టర్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

Similar News

News December 12, 2025

వనపర్తి జిల్లాలో FINAL పోలింగ్ శాతం

image

వనపర్తి జిల్లాలో 87 గ్రామ పంచాయతీల్లో గురువారం మొదటి విడత ఎన్నికలు జరిగాయి. కాగా మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ముగియగా సమయానికి కేంద్రంలోపలికి వచ్చి క్యూలైన్‌లో నిలబడిన వారందరికీ ఓటేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. దీంతో జిల్లాలో ఫైనల్‌గా 84.94 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు ప్రకటించారు.

News December 12, 2025

భద్రాద్రి జిల్లాలో FINAL పోలింగ్ శాతం

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 159 పంచాయతీల్లో గురువారం మొదటి విడత ఎన్నికలు జరిగాయి. కాగా మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ముగియగా సమయానికి కేంద్రంలోపలికి వచ్చి క్యూలైన్‌లో నిలబడిన వారందరికీ ఓటేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. దీంతో జిల్లాలో ఫైనల్‌గా 71.79 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు ప్రకటించారు.

News December 12, 2025

ప.గో : ఇకపై వాహన చలానాలు ఇలా..!

image

వాహనదారులు ట్రాఫిక్‌ ఉల్లంఘనలు చేసే సమయంలో ట్రాఫిక్‌ పోలీసులు విధించే చలానాలు ఇకపై ఫోన్‌పే ద్వారా చెల్లించాలని తణుకు పట్టణ సీఐ ఎన్‌.కొండయ్య కోరారు. ఫోన్‌పేలో కొత్తగా ఈ ఛాలాన్‌ అనే టాబ్‌ ద్వారా వాహనం నంబర్ ఎంటర్‌ చేస్తే చలానాలు కనిపిస్తాయన్నారు. వాటిని తక్షణమే ఒక సెకన్‌లో చెల్లించి ట్రాఫిక్‌ పోలీసులకు సహకరించాలని సీఐ కొండయ్య కోరారు.