News February 2, 2026

కలెక్టర్ హరేంధిర ప్రసాద్‌కు మత్స్యకారుల కృతజ్ఞతలు

image

బంగ్లాదేశ్ నుండి సురక్షితంగా స్వదేశం చేరుకున్న 9 మంది మత్స్యకారులు సోమవారం విశాఖ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. విదేశీ వ్యవహారాల శాఖతో సమన్వయం చేసి, తమను ప్రాణాపాయం నుండి కాపాడినందుకు వారు భావోద్వేగానికి లోనయ్యారు. మత్స్యకారుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న కలెక్టర్, భవిష్యత్తులో సరిహద్దుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Similar News

News February 6, 2026

విశాఖలో ‘శిఖర్ సే సాగర్ తక్’ స్వచ్ఛతా కార్యక్రమాలు

image

జీవీఎంసీ, సులభ్ ఇంటర్నేషనల్ సంయుక్తంగా ఫిబ్రవరి 7, 8 తేదీల్లో ఆర్కే బీచ్‌లో ‘శిఖర్ సే సాగర్ తక్’ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. శనివారం స్వచ్ఛత వాక్, యువతకు 5 కి.మీ.రన్, సైకత శిల్పాల ప్రదర్శన ఉంటాయి. ఆదివారం సైక్లోథాన్, బీచ్ క్లీనింగ్ నిర్వహిస్తారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో నగరాన్ని ప్రథమస్థానంలో నిలబెట్టేందుకు కృషి చేయాలని కమిషనర్ కేతన్ గార్గ్ కోరారు.10 కి.మీ.రన్ రద్దు చేశారన్నారు.

News February 6, 2026

విశాఖలో TDP-జనసేన మధ్య అంతర్గత హీట్

image

విశాఖలో TDP-జనసేన మధ్య అంతర్గత రాజకీయ విభేదాలు తెరపైకి వచ్చాయి. సిట్టింగ్ MLA వంశీకృష్ణ, TDP ఇన్‌ఛార్జ్‌ సీతంరాజు సుధాకర్ మధ్య సమన్వయం లోపించిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. నామినేటెడ్ పదవులు, అభివృద్ధి కార్యక్రమాల్లో TDP క్యాడర్‌కు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ అంశం TDP హైకమాండ్ వరకు చేరినట్టు సమాచారం. పొత్తులో ఆధిపత్య పోరు కూటమికి సవాలుగా మారుతుందన్న చర్చ సాగుతోంది.

News February 5, 2026

రైల్వే జోన్‌పై కేంద్రం చిన్నచూపు.. విశాఖ వాసుల ఆవేదన

image

విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై కేంద్రం మరోసారి నీళ్లు చల్లింది. 2026 బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టుకు కేవలం రూ. 170 కోట్లు మాత్రమే కేటాయించింది. రూ.3,500 కోట్ల అంచనా వ్యయం ఉన్న ఈ ప్రాజెక్టుకు ఈ నిధులు ఏమాత్రం సరిపోవని, జోన్ నిర్మాణంపై కేంద్రానికి చిత్తశుద్ధి లేదని పలు విమర్శలు వస్తున్నాయి. ఈ నామమాత్రపు కేటాయింపులతో జోన్ కల నెరవేరడంపై విశాఖ ప్రజలు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.