News November 19, 2025

కలెక్టర్ హెచ్చరిక

image

ప్రతి సోమవారం తహశీల్దార్ కార్యాలయంలో నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ప్రజలు ఇచ్చే దరఖాస్తులను ఆన్లైన్ చేసి వారికి రసీదు ఇవ్వాలని కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. మంగళవారం నంద్యాల కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో తహశీల్దార్లతో పలు రెవెన్యూ అంశాలపై రివ్యూ నిర్వహించారు. పీజీఆర్ఎస్ అర్జీలను నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని కలెక్టర్ హెచ్చరించారు. భూ సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు.

Similar News

News March 30, 2026

ప.గో జిల్లాలో నేడు ఇళ్ల పంపిణీ

image

ప.గో జిల్లాలో నిర్మాణం పూర్తయిన గృహాలను నేడు లబ్ధిదారులకు పండుగ వాతావరణంలో అందజేయనున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొనే ఈ వేడుకకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆమె అన్నారు. పేదల సొంతింటి కలను సాకారం చేయడంలో ప్రభుత్వం చేపట్టిన ఈ గృహ నిర్మాణ పథకం ఇప్పుడు కీలక దశకు చేరుకుందని కలెక్టర్ పేర్కొన్నారు.

News March 30, 2026

కర్నూలు జిల్లాలో కరవు మండలాలు ఇవే

image

2024-25 ఆర్థిక సంవత్సరానికి కర్నూలు(D)లో 9 మండలాలను కరవు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించింది. ఆస్పరి, కల్లూరు, కర్నూలు రూరల్, అర్బన్, మద్దికేర, ఓర్వకల్లు, గూడూరు, కోడుమూరు, వెల్దుర్తి మండలాలు ఆ జాబితాలో ఉన్నాయి. అయితే మంత్రాలయం నియోజకవర్గంలో ఒక్క మండలం కూడా లేకపోవడం, ఆలూరు నియోజకవర్గంలో 6 మండలాల్లో ఆస్పరి మాత్రమే ఉండటం, ఆదోని నియోజకవర్గంలో ఒక్క మండలాన్నీ చేర్చకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

News March 30, 2026

చందర్లపాడులో హత్య.. అప్‌డేట్ ఇదే

image

చందర్లపాడు మం‌డలం చింతలపాడులో ఆదివారం వెంకటపతి (80) <<19509397>>హత్యకు <<>>గురైన విషయం తెలిసిందే. గుర్తు తెలియని వ్యక్తులు కొడవలితో ముక్కు, గొంతు, చేతులపై విచక్షణారహితంగా నరికి చంపినట్లుగా ఉందని స్థానికులు చెబుతున్నారు. పాత కక్షలా లేక మద్యం మత్తులో జరిగిన ఘాతుకమా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మృతుడికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.