News November 19, 2025

కలెక్టర్ హెచ్చరిక

image

ప్రతి సోమవారం తహశీల్దార్ కార్యాలయంలో నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ప్రజలు ఇచ్చే దరఖాస్తులను ఆన్లైన్ చేసి వారికి రసీదు ఇవ్వాలని కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. మంగళవారం నంద్యాల కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో తహశీల్దార్లతో పలు రెవెన్యూ అంశాలపై రివ్యూ నిర్వహించారు. పీజీఆర్ఎస్ అర్జీలను నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని కలెక్టర్ హెచ్చరించారు. భూ సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు.

Similar News

News March 27, 2026

మార్కాపురం జిల్లాలో ఆ బస్సులు చాలా డేంజర్..!

image

మార్కాపురం ప్రమాదంతో నెల్లూరు (D) కలిగిరికి చెందిన <<19487686>>హరికృష్ణ <<>>ప్రైవేట్ ట్రావెల్స్ తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన డొక్కు బస్సులను తక్కువ ధరకు కొనుగోలు చేస్తారని సమాచారం. వాటిపై పాత ట్రావెల్స్ పేర్లు ఉండటమే ఇందుకు నిదర్శనం. ప్రయాణ సమయంలో తరచూ రిపేర్లకు గురవుతుంటాయని.. చాలాసార్లు మార్గమధ్యంలోనే బస్సులను మారుస్తుంటారని అందులో ప్రయాణించిన వాళ్లు చెబుతున్నారు.

News March 27, 2026

సంగారెడ్డి: బంగారు ఆభరణాలతో సీతారాముల దర్శనం

image

సంగారెడ్డిలోని శ్రీరామ మందిరంలో సీతారాముల విగ్రహాలకు బంగారు ఆభరణాలతో శుక్రవారం ప్రత్యేకంగా అలంకరించారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తన నివాసం నుంచి ఊరేగింపుగా ఆభరణాలను తీసుకువెళ్లి సీతారాములకు అలంకరణ చేశారు. భద్రాచలంలో ఉన్న మాదిరిగా ఇక్కడి సీతారాముల విగ్రహాలు ఉండడం ఇక్కడి ప్రత్యేకత.

News March 27, 2026

భద్రాద్రి రాములోరిని చూడండి..!

image

దక్షిణ అయోధ్య భద్రాద్రి రాములోరి పెళ్లి అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. పెళ్లికొడుకు అలంకరణలో రామయ్య, పెళ్లి కూతురి అలంకరణలో సీతమ్మ భక్తులను కనువిందు చేస్తున్నారు. స్వామి, అమ్మవార్ల రూపాలు భక్తులను కట్టి పడేస్తున్నాయి. భద్రాద్రి పరిసరాలు ‘జై శ్రీరామ్’ నినాదాలతో మార్మోగుతున్నాయి. రామయ్య పెళ్లి వేడుకలో CM దంపతులు, డిప్యూటీ CM దంపతులు సహా మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.