News November 19, 2025

కలెక్టర్ హెచ్చరిక

image

ప్రతి సోమవారం తహశీల్దార్ కార్యాలయంలో నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ప్రజలు ఇచ్చే దరఖాస్తులను ఆన్లైన్ చేసి వారికి రసీదు ఇవ్వాలని కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. మంగళవారం నంద్యాల కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో తహశీల్దార్లతో పలు రెవెన్యూ అంశాలపై రివ్యూ నిర్వహించారు. పీజీఆర్ఎస్ అర్జీలను నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని కలెక్టర్ హెచ్చరించారు. భూ సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు.

Similar News

News March 26, 2026

మెదక్: ఆధార్ కోసం క్యూ కట్టిన కోతి..!

image

ఆధార్ కార్డు కేవలం మనుషులకేనా.. మాకూ కావాలి అన్నట్టుగా వ్యవహరించింది ఆ కోతి. మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండల కార్యాలయం వద్ద ఆధార్ కేంద్రం బోర్డును ఓ కోతి ఆక్రమించింది. నిత్యం ప్రజలను భయపెట్టే ఈ వానర సైన్యం, ఒక్కసారిగా ఆధార్ బోర్డుపై ఎక్కి అటు ఇటు ఊగుతూ హల్‌చల్ చేసింది. ఈ వింత దృశ్యాన్ని చూసిన స్థానికులు, “కోతి కూడా ఆధార్ కోసం క్యూ కట్టినట్లుంది” అని సరదాగా అన్నారు.

News March 26, 2026

మహాభారతంలో భాగమే భగవద్గీత

image

వ్యాసుడు రచించిన మహాభారతంలో ఓ భాగమే భగవద్గీత అనే విషయం చాలామందికి తెలిసే ఉంటుంది. భారత ఇతిహాసంలో భీష్మ పర్వం 25వ అధ్యాయం మొదలు 42వ అధ్యాయం వరకు మొత్తం 18 అధ్యాయాలను భగవద్గీతగా చెబుతారు. ఇందులో మొత్తం 700 శ్లోకాలు ఉంటాయి. ఇవి మనం ధర్మబద్ధంగా ఎలా జీవించాలో నేర్పుతాయి. బంధువులను చంపడానికి విముఖత చూపిన అర్జునుడిని ధర్మ మార్గాన్ని చూపడానికి, ధర్మాన్ని గెలిపించడానికి కృష్ణుడు గీతబోధ చేశాడు.

News March 26, 2026

పల్నాడుకు ప్రాతినిధ్యం వహించిన మహిళా మణులు వీరే..!

image

పల్నాడు ప్రాంత ప్రజలు 1967లోనే మహిళలకు పట్టం కట్టారు. 1967,1972లలో వినుకొండ నియోజకవర్గం నుంచి తొలి మహిళా MLAగా భవనం జయప్రద ఎన్నికవటంతో పాటు మంత్రిగా విధులు నిర్వర్తించారు. 1983 సత్తెనపల్లి,1989లో వినుకొండ నుంచి నన్నపనేని రాజకుమారి MLAగా ఎన్నికయ్యారు.1994లో సత్తెనపల్లి నుంచి పుతంబాక భారతి, 1999లో మాచర్ల నుంచి జూలకంటి దుర్గమ్మ, 2019లో చిలకలూరిపేట నుంచి విడుదల రజిని MLAగా, మంత్రిగా పనిచేశారు.