News November 19, 2025

కలెక్టర్ హెచ్చరిక

image

ప్రతి సోమవారం తహశీల్దార్ కార్యాలయంలో నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ప్రజలు ఇచ్చే దరఖాస్తులను ఆన్లైన్ చేసి వారికి రసీదు ఇవ్వాలని కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. మంగళవారం నంద్యాల కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో తహశీల్దార్లతో పలు రెవెన్యూ అంశాలపై రివ్యూ నిర్వహించారు. పీజీఆర్ఎస్ అర్జీలను నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని కలెక్టర్ హెచ్చరించారు. భూ సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు.

Similar News

News March 30, 2026

ఐదు గ్యారెంటీలతో అస్సాం బరిలో కాంగ్రెస్

image

ఐదు గ్యారెంటీల మేనిఫెస్టోతో కాంగ్రెస్ అస్సాం ఎన్నికల బరిలోకి దిగింది. మహిళలకు నెలవారీ నగదు బదిలీతో పాటు వ్యాపార విస్తరణకు ₹50వేల సాయం చేస్తాయని ప్రకటించింది. సీనియర్ సిటిజన్లకు నెలకు ₹1,250 చొప్పున పెన్షన్లు, 100 రోజుల్లోనే సింగర్ జుబిన్ గార్గ్ మృతి కేసులో న్యాయం, ₹25లక్షల క్యాష్‌లెస్ హెల్త్ ఇన్సూరెన్స్, 10లక్షల మందికి శాశ్వత భూపట్టాలను ఇప్పిస్తామని హామీ ఇచ్చింది.

News March 30, 2026

KMR: అత్తను హతమార్చిన కోడలు.. 24 గంటల్లో ఛేదించిన పోలీసులు

image

గాంధారి మండలం సీతాయిపల్లిలో రుక్మవ్వ(73) హత్య కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. బంగారం, డబ్బుల కోసం కోడలు కోటవ్వ తన అత్తను బండతో కొట్టి చంపినట్లు విచారణలో తేలింది. హత్య అనంతరం ఏమీ తెలియనట్లు డ్రామా ఆడింది. పోలీసుల విచారణలో నిజం తేలింది. నిందితురాలి నుంచి 15 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. చాకచక్యంగా వ్యవహరించిన పోలీస్ బృందాన్ని SP రాజేశ్ చంద్ర అభినందించారు.

News March 30, 2026

US స్థావరాలపై దాడుల్లో ఇరాన్‌కు రష్యా సహకారం: జెలెన్‌స్కీ

image

సౌదీ అరేబియాలోని US స్థావరాలపై ఇరాన్ చేపట్టిన దాడి వెనుక రష్యా సహకారం ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు. ఇరాన్‌కు రష్యా 100% సహకరిస్తోందన్నారు. మార్చి 20, 23, 25 తేదీల్లో సౌదీలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్‌‌ శాటిలైట్ చిత్రాలను రష్యా క్యాప్చర్ చేసిందని తెలిపారు. ఒకటి కన్నా ఎక్కువసార్లు అలా శాటిలైట్ ఇమేజెస్‌ను రష్యా సాధారణంగా సేకరించదని పేర్కొన్నారు.