News January 24, 2026

కలెక్షన్స్‌లో ధురంధర్‌ను దాటేసిన బార్డర్-2

image

సన్నీ డియోల్ నటించిన ‘బార్డర్-2’ ఫస్ట్ డే ఇండియా(హిందీ) కలెక్షన్లలో ఆల్ టైమ్ హిట్ ‘ధురంధర్’ రికార్డును బ్రేక్ చేసింది. Sacnilk.com ప్రకారం.. ధురంధర్ మొదటి రోజు ₹27 కోట్లు (నెట్) వసూలు చేయగా, బార్డర్-2 ఏకంగా ₹30 కోట్లు రాబట్టి సత్తా చాటింది. అయితే ఓవరాల్ వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్లలో మాత్రం ధురంధర్ (₹41.5 కోట్లు) కంటే బార్డర్-2 (₹41 కోట్లు) స్వల్పంగా వెనుకబడి ఉంది.

Similar News

News February 10, 2026

ఆన్‌లైన్‌లో కోటప్పకొండ దర్శనం టికెట్లు

image

AP: మహాశివరాత్రి రోజున పల్నాడు జిల్లా కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి దర్శనం టికెట్లు నేటి నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. https://www.aptemples.org/లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అభిషేకం రూ.500, శీఘ్ర దర్శనం రూ.200, ప్రత్యేక దర్శనం రూ.100 టికెట్లు ఆన్‌లైన్‌లో ఉంటాయి. భక్తుల రద్దీ దృష్ట్యా వీఐపీ ఉచిత పాసులు రద్దు చేసి, రూ.300 వీఐపీ దర్శనం టికెట్లు విక్రయిస్తున్నామని ఈవో చంద్రశేఖర్ తెలిపారు.

News February 10, 2026

ఢిల్లీలో CBN.. అమరావతి, పోలవరం నిధులపై ఫోకస్!

image

AP: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు ఇవాళ కేంద్రమంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, శివరాజ్ సింగ్, అశ్వినీ వైష్ణవ్, సీఆర్ పాటిల్‌తో సహా పలువురితో భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించి అమరావతి చట్టబద్ధత, పోలవరం ప్రాజెక్టు, పథకాలు, ఇతర అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపుపై వారితో చర్చించనున్నారు. వరుస భేటీల అనంతరం సాయంత్రం 5 గంటలకు తిరిగి అమరావతికి బయల్దేరుతారు.

News February 10, 2026

ఉల్లిని నమ్మి, తల్లిని నమ్మి చెడినవాడు లేడు

image

ఉల్లిపాయ మన ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల శరీరానికి మేలు జరుగుతుంది, ఎటువంటి హాని జరగదు. అలాగే తల్లి తన పిల్లలకు ఎప్పుడూ మంచి జరగాలనే కోరుకుంటుంది. తల్లి ప్రేమ స్వచ్ఛమైనది, నిస్వార్థమైనది. తల్లిని నమ్ముకుని, ఆమె మాట విని నడుచుకుంటే జీవితంలో ఎప్పుడూ కష్టాలు ఎదురవవు. అందుకే ఉల్లిని, తల్లిని నమ్మిన వారు ఎప్పటికీ నష్టపోరని ఈ సామెత వివరిస్తుంది.