News March 30, 2026
‘కల్కి’లోకి మరో బాలీవుడ్ యాక్టర్?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ‘కల్కి-2’ చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం అమితాబ్, కమల్ పాత్రలపై కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. అయితే ఈ సీక్వెల్‌లో కొత్త పాత్ర(నెగటివ్)ను డైరెక్టర్ పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఓ బాలీవుడ్ నటుడు నటిస్తున్నట్లు సమాచారం. అలాగే ఈ చిత్రానికి ‘కర్ణ 3102 BC’ టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి.
Similar News
News April 13, 2026
నేడు RRతో SRH ఢీ.. పరుగుల వరద ఖాయం!

IPLలో ఇవాళ ఆసక్తికర పోరు జరగనుంది. భీకర బ్యాటింగ్ లైనప్ ఉన్న రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ తలపడనున్నాయి. హైదరాబాద్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో పరుగుల వరద పారే అవకాశం ఉంది. ఈ సీజన్‌లో ఆడిన 4 మ్యాచుల్లోనూ గెలిచి RR దూకుడు మీద ఉంది. పైగా వైభవ్ సూర్యవంశీ, జైస్వాల్ చెలరేగి ఆడుతున్నారు. మరోవైపు SRH 4 మ్యాచుల్లో 3 ఓటములు చవిచూసింది. నేటి మ్యాచులో గెలవాలని ఉవ్విళ్లూరుతోంది.
News April 13, 2026
5 కేజీల సిలిండర్ల సరఫరా పెంపు

గ్యాస్ కొరతను నివారించేందుకు కేంద్రం 5 కేజీల LPG సిలిండర్ల సరఫరాను భారీగా పెంచింది. మార్చి 23 నుంచి 13 లక్షలకు పైగా సిలిండర్లను అమ్మింది. ప్రస్తుతం రోజువారీ సేల్స్ లక్ష యూనిట్లను దాటాయి. ఎక్కువగా వలస కార్మికులు వీటిని కొంటున్నారు. మరోవైపు మార్చి నుంచి 4.24 లక్షల PNG కనెక్షన్లను ప్రభుత్వం యాక్టివేట్ చేసింది. డొమెస్టిక్ LPG సరఫరా స్థిరంగా కొనసాగుతోంది. ఈ నెల 11న 52 లక్షల సిలిండర్లు డెలివరీ అయ్యాయి.
News April 13, 2026
సరిహద్దు గ్రామాలకు చైనా పేర్లు.. ఖండించిన భారత్

అరుణాచల్ ప్రదేశ్ సహా భారత్ సరిహద్దుల్లోని గ్రామాలకు చైనా పేర్లు మార్చడాన్ని భారత్ ఖండించింది. ఈ ఫేక్ నేమ్స్ నిజాన్ని మార్చలేవని విదేశాంగ శాఖ పేర్కొంది. ఈ తరహా చర్యలు ఇరు దేశాల మధ్య బంధాన్ని మరింత దెబ్బతీస్తాయని హెచ్చరించింది. కాగా ఇటీవల PoK సరిహద్దు వెంబడి చైనా కొత్త గ్రామాన్ని నిర్మించింది. గతంలో ఇక్కడే రెండు గ్రామాలు నిర్మించగా అందులో కొంత లద్దాక్ పరిధిలోకి వస్తుందని భారత్ తోసిపుచ్చింది.


