News February 4, 2026

కల్కి పార్ట్-2లో 90 నిమిషాల పాటు కమల్!

image

రెబల్ స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో రానున్న కల్కి పార్ట్-2పై భారీ అంచనాలున్నాయి. FEB చివరి వారం నుంచి ఈ భారీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. అయితే పార్ట్-1లో తక్కువ నిడివి ఉన్న కమల్ హాసన్ పాత్ర పార్ట్-2లో 90 నిమిషాల పాటు ఉంటుందట. అలాగే 2 వెరైటీ లుక్స్‌లో కనిపించనున్నారని సినీ వర్గాల టాక్. దీనికి తోడు ఈ మూవీలో సాయి పల్లవి కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది.

Similar News

News February 21, 2026

NABARDలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

<>NABARD<<>> బ్యాంక్స్ మెడికల్ ఆఫీసర్(BMO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. MBBS, PG అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు మార్చి 15 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 70ఏళ్లు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. గంటకు రూ.1000 చొప్పున చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.nabard.org

News February 21, 2026

మేడారం జాతరకు యునెస్కో గుర్తింపు తేవాలి: సీతక్క

image

TG: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు యునెస్కో గుర్తింపు తెచ్చేందుకు కృషి చేయాలని కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్‌ను మంత్రి సీతక్క కోరారు. అందుకు తగిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. జాతీయ, అంతర్జాతీయంగా జాతరకు విశేష గుర్తింపు లభించేలా విస్తృత ప్రచారం కల్పించిన ట్రస్ట్‌ను అభినందించారు. కాగా జనవరి 28 నుంచి 31 వరకు జరిగిన మేడారం జాతరకు సుమారు 2 కోట్ల మందికి పైగా హాజరయ్యారు.

News February 21, 2026

నేరేడుకు నీరు, పోషకాలు ముఖ్యం

image

నేరేడు తోటల్లో అధిక దిగుబడి రావాలంటే చెట్లకు తగిన పోషకాలను, నీటిని కూడా అందించాలి. అందుకే పంట పూత నుంచి పిందెలు, కాయలు ఏర్పడే దశలో నిపుణుల సూచనలతో తగిన మోతాదులో ఒకసారి యూరియా, పొటాష్ అందిస్తే అవి పండ్ల ఎదుగుదలకు బాగా ఉపయోగపడతాయి. అలాగే డ్రిప్ పద్ధతిలో తోటలకు నీరు అందిస్తుంటే.. ఎరువులను కూడా ఫర్టిగేషన్ పద్ధతిలో ఇవ్వాలి. దీని వల్ల మంచి నాణ్యతతో కూడిన దిగుబడిని పొందే అవకాశం ఉంటుంది.