News June 28, 2024

‘కల్కి2898 AD’ టీంలో మన ఏలూరు కుర్రోడు

image

రెబల్‌స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి2898 AD’ మూవీలో కీలకమైన బుజ్జి రోబోని డిజైన్ చేసిన సభ్యులలో మన ఏలూరు జిల్లా కుర్రోడు ఒకరవడం విశేషం. చింతలపూడి మండలం బోయగూడెం గ్రామానికి చెందిన రాకేష్ విశాఖపట్టణంలోని గీతం కళాశాలలో మెకానికల్ ఇంజినీరింగ్ చేశాడు. ప్రస్తుతం హైదరాబాద్ టీహబ్లో వర్క్ చేస్తున్నాడు. కల్కి మూవీలోని రోబో తయారీలో భాగస్వామ్యం అయినందుకు పలువురు అతణ్ని అభినందిస్తున్నారు.
☛ CONGRATS రాకేష్

Similar News

News November 27, 2024

ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేస్తాం: జేసీ

image

తుఫాను భయంతో ముందస్తు కోతలు, నూర్పిడి చేయొద్దని జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి రైతులకు సూచించారు. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేస్తామని భరోసానిచ్చారు. జిల్లా బుధవారం జిల్లాలోని మండవల్లి, ముదినేపల్లి మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె పరిశీలించారు. తుఫాను హెచ్చరికల విషయమై రైతులెవరూ ఆందోళన చెందవద్దని చెప్పారు. రైతులకు అండగా ఉండాలని అధికారులకు సూచించారు.

News November 27, 2024

ఓం బిర్లాను కలిసిన RRR

image

దేశ రాజధాని ఢిల్లీలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణమ రాజు(RRR) మర్యాదపూర్వకంగా కలిశారు. పలు రాజకీయ విషయాలు పంచుకున్నారు. RRR వెంట ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఉన్నారు. 

News November 27, 2024

నన్ను కొట్టిన వాళ్లంతా జైలుకు వెళ్తారు: RRR

image

ఉండి MLA, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణమ రాజు(RRR) కీలక వ్యాఖ్యలు చేశారు. ‘గత ప్రభుత్వంలో నాపై కేసు పెట్టారు. విచారణలో భాగంగా కొందరు అధికారులు నన్ను కొట్టారు. ఇప్పుడు వాళ్లంతా జైలుకు వెళ్లడం ఖాయం. సీఐడీ మాజీ ఏఎస్పీ విజయ్‌పాల్ అరెస్ట్‌ను స్వాగతిస్తున్నా. ఈ కేసులో కీలకంగా ఉన్న సీఐడీ మాజీ చీఫ్ సునీల్ విదేశాలకు పారిపోయే అవకాశం ఉంది. ఆయనపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేయాలి’ అని RRR కోరారు.