News October 6, 2025
కల్తీ మద్యం కేసు.. కీలక TDP నేతలు ఔట్.!

రాష్ట్రంలో సంచలనం రేపిన ములకలచెరువు కల్తీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తంబళ్లపల్లి TDP నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ దాసరపల్లి జై చంద్రారెడ్డిని CM చంద్రబాబు ఆదేశాల మేరకు సస్పెండ్ చేస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఈ కేసులో నిందితుడుగా ఉన్న పీటీ మండలం మల్లెలకు చెందిన కట్ట సురేంద్ర నాయుడును సైతం పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు.
Similar News
News October 6, 2025
కామారెడ్డి: ఎన్నికల నగారా.. రాజకీయ కార్యాచరణ వేగం

రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలతో కామారెడ్డి జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. జిల్లాలోని ప్రధాన రాజకీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, BRS పార్టీలు ఎన్నికల కార్యాచరణను వేగవంతం చేశాయి. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు అభ్యర్థుల విజయం కోసం స్థానిక నాయకులు, కార్యకర్తలతో విస్తృత స్థాయి సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ప్రభుత్వాల అభివృద్ధి, సంక్షేమ పథకాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని కోరుతున్నారు.
News October 6, 2025
పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్.. భారత్‌కు 22 మెడల్స్

ఢిల్లీలో వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీలు ముగిశాయి. భారత్ 22 పతకాలను (6 గోల్డ్, 9 సిల్వర్, 7 బ్రాంజ్) గెలుచుకుంది. పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో ఇండియాకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. కాగా ఈ ఛాంపియన్‌షిప్‌లో 100కు పైగా దేశాల నుంచి 2,200 మందికి పైగా అథ్లెట్లు పోటీ పడ్డారు. ఖతార్, UAE, జపాన్ తర్వాత వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ను నిర్వహించిన నాలుగో ఆసియా దేశంగా IND నిలిచింది.
News October 6, 2025
ఆసిఫాబాద్‌లో స్థానిక ఎన్నికల్లో వర్గ పోరు

కాంగ్రెస్ పార్టీ నుంచి స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. ASFలో కాంగ్రెస్ వర్గ పోరు కొనసాగుతుండటంతో ఆశావహులకు ఎదురుదెబ్బ తగలక తప్పదని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. డీసీసీ అధ్యక్షుడు విశ్వ ప్రసాద్ ఒక వర్గమైతే.. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ శ్యాంనాయక్ మరో వర్గం. ఎంపీపీ, ఎంపీటీసీ స్థానాలకు రెండు వర్గాల నాయకులు ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.