News October 7, 2025

కల్తీ మద్యం.. ములకలచెరువు ఎక్సైజ్ సీఐపై వేటు

image

ములకలచెరువు ఎక్సైజ్ సీఐ హిమబిందుపై వేటు పడింది. ఇటీవల నకిలీ మద్యం తయారీ స్థావరాన్ని పోలీసులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ మద్యం తయారీ స్థావరాన్ని గుర్తించడంలో అలసత్వం వహించారనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆమెను విజయవాడ ఎక్సైజ్ కమిషనర్ ఆఫీసుకు అటాచ్ చేస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. లక్కిరెడ్డిపల్లె ఎక్సైజ్‌ సీఐ కిషోర్‌ ములకలచెరువు ఎక్సైజ్‌ సీఐ బాధ్యతలు చేపట్టనున్నారు.

Similar News

News October 7, 2025

మాజీ ప్రధాని దేవెగౌడకు అస్వస్థత

image

మాజీ ప్రధాని HD దేవెగౌడ(92) అస్వస్థతకు గురయ్యారు. యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్(UTI)తో బాధపడుతున్న ఆయనను నిన్న బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స అందించిన వైద్యులు.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు.

News October 7, 2025

మలయాళ సూపర్‌స్టార్‌కు అరుదైన గౌరవం

image

మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది నుంచి ఆయన COAS కమెండేషన్ కార్డ్ అందుకున్నారు. ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేస్తూ మోహన్‌లాల్ ట్వీట్ చేశారు. ‘హానరరీ లెఫ్టినెంట్ కల్నల్ గుర్తింపు దక్కడం గర్వంగా ఉంది. ఆర్మీ చీఫ్‌, నా మాతృసంస్థైన టెరిటోరియల్ ఆర్మీకి ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. ఇటీవల ఆయన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న విషయం తెలిసిందే.

News October 7, 2025

ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి: MNCL కలెక్టర్

image

జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. ఉన్నతాధికారులతో మంగళవారం కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. మండల, జిల్లా ప్రజా పరిషత్ ఎన్నికలను 2 విడుతలలో నిర్వహిస్తామన్నారు. 16 జడ్పీటీసీ, 129 ఎంపీటీసీ స్థానాలకు 9నుంచి 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మొదటి విడత ఎన్నికలకు నామినేషన్ల స్వీకరిస్తామని స్పష్టం చేశారు.