News August 22, 2024

కల్యాణ లక్ష్మి పథకానికి నిధులు విడుదల: మంత్రి పొన్నం

image

బీసీ, ఈబీసీ కళ్యాణలక్ష్మి పథకానికి TG ప్రభుత్వం తాజాగా రూ.1225.43 కోట్లు విడుదల చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 2024-25 బడ్జెట్‌లో కళ్యాణలక్ష్మి పథకానికి రూ.2175 కోట్లు కేటాయించింది. మొదటిదశలో రూ.1225.43 కోట్లు విడుదల చేసింది. పెండింగ్ దరఖాస్తులతో పాటు తాజాగా అప్లై చేసుకున్న వారికి నిధులు విడుదల చేసినందుకుగాను సీఎం రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలిపారు.

Similar News

News December 24, 2025

ఐటీ విభాగంలో మెదక్ పోలీస్ సిబ్బంది ప్రతిభ

image

మెదక్ జిల్లా పోలీస్ సిబ్బంది CCTNS/ ఐటీ ఆధారిత వ్యవస్థల అమలులో ఉత్తమ ప్రతిభ కనబర్చారు. రాష్ట్ర అదనపు డీజీపీ(టెక్నికల్ సర్వీసెస్) వి.వి. శ్రీనివాసరావు చేతుల మీదుగా కమెండేషన్ లెటర్స్, ప్రశంసా పత్రాలు అందుకున్నారు. మెదక్ జిల్లా నుంచి ఐటీ కోర్ టీం సభ్యులు అనిల్, ఆర్.అమరనాథ్, టెక్ టీం రైటర్స్ మౌనిక, రాజు ప్రశంసాపత్రాలు అందుకున్నారు. వీరిని ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు అభినందించారు.

News December 24, 2025

బీజేపీ సర్పంచ్‌లకు రూ. 25 లక్షల నిధులు: ఎంపీ రఘునందన్

image

బీజేపీ మద్దతుతో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లకు కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.25 లక్షల అభివృద్ధి నిధులు తప్పకుండా తీసుకొస్తానని మెదక్ ఎంపీ రఘునందన్ రావు హామీ ఇచ్చారు. జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ రాధామల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యుల సన్మాన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధిలో బీజేపీ ప్రజాప్రతినిధులు ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు.

News December 24, 2025

నర్సాపూర్: ప్రేమ విఫలం.. యువకుడి ఆత్మహత్య

image

ప్రేమ విఫలం కావడంతో యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన నర్సాపూర్ మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని పెద్ద చింతకుంట గ్రామానికి చెందిన వేణు (24) డిగ్రీ పూర్తి చేసి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం ఇంటి నుంచి వెళ్లి గ్రామ శివారులో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.