News February 3, 2025
కల్వకుర్తిలో అథ్లెటిక్స్ ఎంపికలకు ఏర్పాట్లు పూర్తి

కల్వకుర్తిలోని బాలుర ఉన్నత పాఠశాలలో నేడు జరిగే జిల్లా అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఫిజికల్ డైరెక్టర్ ప్రసాద్ పేర్కొన్నారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చే క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను చాటాలని ఆయన సూచించారు. ఎంపిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ సోల పోగుల స్వాములు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News February 28, 2026
అనంత: పోలీస్ వాహనం ధ్వంసం.. నిందితుడి అరెస్ట్

మద్యం మత్తులో భార్యపై దాడి చేయడమే కాకుండా పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతపురం రాణినగర్‌కు చెందిన బళ్లారి బాబా మౌలా మద్యం మత్తులో తన భార్యను కొడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు అక్కడికి వెళ్లగా వారిపై తిరగబడి వాహనాన్ని ధ్వంసం చేశాడు, దీంతో అతన్ని అరెస్ట్ చేసి 14 రోజులు రిమాండ్ (జిల్లా జైలు)కు తరలించారు.
News February 28, 2026
అఫ్గానిస్థాన్‌తో అంత ఈజీ కాదు!

అఫ్గానిస్థాన్‌కు ‘సామ్రాజ్యాల శ్మశానం’ అని పేరుంది. 19వ శతాబ్దంలో బ్రిటన్, గత శతాబ్దంలో సోవియట్ యూనియన్, ఇటీవల అమెరికా వంటి అగ్రరాజ్యాలు ఇక్కడ అడుగుపెట్టి భారీ ప్రాణ, ఆస్తి నష్టంతో వెనుదిరిగాయి. దుర్భేద్యమైన హిందూకుష్ పర్వతాలు, స్థానిక తెగల గెరిల్లా పోరాటాల వల్ల ఏ దేశమూ ఇక్కడ నిలబడలేకపోయింది. చరిత్రలో సామ్రాజ్యాలనే మింగేసిన ఈ గడ్డ ఇప్పుడు పాక్‌కు సవాల్ విసురుతోంది.
News February 28, 2026
మెదక్: ఉమ్మడి జిల్లాలో ముగ్గురు కలెక్టర్లు మహిళలే!

ఉమ్మడి మెదక్ జిల్లాలో పాలనాధికారులు (కలెక్టర్లు) ముగ్గురూ మహిళలే కావడం విశేషం. ఉమ్మడి జిల్లాలో సంగారెడ్డి కలెక్టర్‌గా ప్రావీణ్య, సిద్దిపేట కలెక్టర్‌గా హైమావతి ఉండగా తాజాగా జరిగిన కలెక్టర్ల బదిలీలో మెదక్ కలెక్టర్ గా ప్రతిమా సింగ్ నియమితులయ్యారు. దీంతో ఉమ్మడి జిల్లా పరిపాలనలో మహిళల చేతిలో ఉంది. 2016లో ఉమ్మడి జిల్లాను మూడు జిల్లాలు (మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట)గా విభజించిన విషయం తెలిసిందే.


