News November 6, 2025
కల్వకుర్తిలో ఇంటి మెట్లపై ‘జెర్రిపోతు’ నిద్ర

కల్వకుర్తి శ్రీ సాయి కాలనీలోని పంచాయతీ సెక్రెటరీ రమేష్ ఇంటి ఆవరణంలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ మెట్లపై ప్రతిరోజు సాయంత్రం ఒక జెర్రిపోతు (పాము) వచ్చి పడుకుంటోంది. ఉదయం చూసినా అక్కడే ఉంటుందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇది విషపూరితం కానప్పటికీ, పెద్ద పాము కావడంతో పిల్లలు భయపడుతున్నారన్నారు. మూడు రోజులుగా ఇలానే జరుగుతోందని వారు పేర్కొన్నారు.
Similar News
News November 6, 2025
ఖచ్చితత్వంతో ఓటర్ల జాబితా రూపొందిస్తున్నాం: కలెక్టర్

జిల్లాలో ఖచ్చితత్వంతో కూడిన ఓటర్ల జాబితా రూపొందిస్తున్నామని కలెక్టర్ వెట్రిసెల్వి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్‌కి వివరించారు. ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం నుండి నిర్వహించిన వీసీలో కలెక్టరేట్ నుంచి కలెక్టర్ పాల్గొన్నారు. రాజకీయ పక్షాల ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటుచేసి, సూచనలు, ఫిర్యాదులను తీసుకుంటున్నామని కలెక్టర్ అన్నారు.
News November 6, 2025
సింగరేణి అధికారులకు సీఎండీ సూచనలు

మైనింగ్ తో పాటు అన్ని శాఖల అధికారులు బాగా పనిచేయాలని సింగరేణి సంస్థ సీఎండీ బలరాం తెలిపారు. ఏ ఒక్క పని పెండింగ్లో ఉండకూడదని, పనితీరులో అలసత్వాన్ని సహించేది లేదన్నారు. గురువారం అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లతో ప్రత్యేక సమీక్షలో సూచనలు చేశారు. వివిధ కార్పోరేట్ విభాగాల జనరల్ మేనేజర్లు ప్రత్యక్షంగానూ, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.
News November 6, 2025
GNT: వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

తెనాలి 1-టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాజర్‌పేటలో వ్యభిచార గృహంపై గురువారం పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులను అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఐ విజయ్ కుమార్ నేతృత్వంలో వెళ్లిన టాస్క్‌ఫోర్స్ బృందం వారి నుంచి రూ. 500 నగదు, 4 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుంది. అసాంఘిక కార్యకలాపాలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు.


