News July 9, 2025
కల్వకుర్తిలో ఈ ప్రాచీన కవి తెలుసా..?

తనకున్న సాహిత్య అభిరుచి ద్వారా ఎన్నో రచనలు చేసిన వ్యక్తి వేపూరు హనుమద్దాస్. ఈయన కల్వకుర్తి మండలంలోని వేపూరుకి చెందిన ప్రాచీన కవి. రాముడిపై తనకున్న భక్తితో అనేక సంకీర్తనలు రాసి ప్రాచుర్యం పొందారు. ఈ కవి రామాయణాన్ని బతుకమ్మ పాట రూపంలో రచించారు. ఇప్పటికీ గ్రామాలలో భక్తులు ఈయన రాసిన కీర్తనలను పాడుతూ ఉంటారు.
Similar News
News July 9, 2025
గోల్డెన్ వీసాపై రూమర్లు నమ్మొద్దు: UAE

తాము ప్రవేశపెట్టబోయే <<16986034>>గోల్డెన్ వీసాపై<<>> వస్తున్న రూమర్లను ఎవరూ నమ్మొద్దని UAE తెలిపింది. దీనిపై ఎలాంటి థర్డ్ పార్టీ సంస్థకు హక్కులు ఇవ్వలేదని, తమ దేశ అధికారిక సైట్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. మధ్యవర్తులను సంప్రదించవద్దని కోరింది. ఈ విషయంలో ఎవరైనా మోసానికి పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మరిన్ని వివరాలకు 600522222ను సంప్రదించాలని సూచించింది.
News July 9, 2025
ఇవాళ భారీ వర్షాలు: వాతావరణ కేంద్రం

TG: రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మంచిర్యాల, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, రంగారెడ్డి, హైదరాబాద్, కామారెడ్డి, MBNR జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పూర్తి లిస్ట్ కోసం <
News July 9, 2025
NLG: స్థానిక ఎన్నికల నిర్వహణకు కసరత్తు

జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు వేగవంతమయ్యాయి. ఇప్పటికే గ్రామపంచాయతీల సరిహద్దులపై ప్రభుత్వానికి అధికారులు నివేదిక పంపించారు. గ్రామాల్లో వార్డులను కూడా ఖరారు చేశారు. తాజాగా మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (MPTCల) పునర్విభజన షెడ్యూల్‌ను ప్రకటించారు. నల్గొండ జిల్లాలో 352కు ఎంపీటీసీ స్థానాలు పెరిగాయి.