News October 9, 2025
కల్వకుర్తిలో ఏసీటీ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

కల్వకుర్తి పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్‌ను (ACT) కలెక్టర్ సంతోష్ గురువారం సందర్శించారు. సెంటర్‌లో ఏర్పాటు చేసిన సౌకర్యాలను ఆయన పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. సాంకేతిక విద్యలో నైపుణ్యం సాధించడం ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో విస్తృత ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అన్నారు.
Similar News
News October 9, 2025
రాజగోపాల్ పేట: ముగిసిన టీజీఈపీసెట్ కౌన్సిలింగ్

ఈనెల 7న ప్రారంభమైన టీజీఈపీసెట్(బైపిసి)-2025 కౌన్సిలింగ్ నేటితో ముగిసిందని రాజగోపాల్ పేట ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ గోవర్ధన్ తెలిపారు. మూడు రోజుల్లో మొత్తం 700 మంది విద్యార్థులు కౌన్సిలింగ్లో పాల్గొన్నారని తెలిపారు. వారి ధ్రువపత్రాలు పరిశీలన చేసి వెబ్ ఆప్షన్లకు సంబంధించిన సూచనలు ఇచ్చామని అన్నారు. కౌన్సిలింగ్ ప్రక్రియలో అభినవ్, రాజు, రామకృష్ణ, షహబాజ్, విజయకుమార్ పాల్గొన్నారు.
News October 9, 2025
సిద్దిపేట: ఎన్నికల్లో చెల్లించాల్సిన డిపాజిట్ వివరాలు

ZPTC స్థానానికి పోటీచేసే జనరల్ అభ్యర్థులు రూ.5 వేలు, SC, ST, BC అభ్యర్థులు రూ.2500 చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. MPTC స్థానానికి జనరల్ వారు రూ.2500, SC, ST, BC అభ్యర్థులు రూ.1250, సర్పంచ్ స్థానానికి జనరల్ అభ్యర్థులు రూ.2 వేలు, SC, ST, BC అభ్యర్థులు రూ.1000, వార్డు మెంబర్ స్థానానికి జనరల్ అభ్యర్థులు రూ.500, SC, ST, BC అభ్యర్థులు రూ.250 చెల్లించాలన్నారు.
News October 9, 2025
అక్టోబర్ 10 నుంచి బోధనేతర పనుల బహిష్కరణ

ప్రభుత్వ పాఠశాలల్లో బోధనేతర కార్యక్రమాల వలన బోధన సమయం హరించిపోతోందని AP ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) ఆరోపించింది. దఫాలుగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా ఏ మాత్రం పట్టించుకోలేదన్నారు. దీంతో బోధనేతర పనులను అక్టోబర్ 10వ తేదీ నుంచి బహిష్కరించాలని తీర్మానించుకున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు గురువారం మెమోరాండాన్ని ఏజన్సీ DEO మల్లేశ్వరరావుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో UTF అధ్యక్షులు రాంబాబుదొర ఉన్నారు.