News April 11, 2025

కల్వకుర్తి: ‘కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కోసం ప్రయత్నాలు..?’

image

కాంగ్రెస్ పార్టీ సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌కు అత్యంత సన్నిహితంగా మెలుగుతూ పార్టీలో కీలక పదవి దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. 

Similar News

News November 4, 2025

వట్లూరు వద్ద రైలు నుంచి జారిపడి వృద్ధుడు మృతి

image

బెంగళూరుకు చెందిన ఉమాశంకర్ (72) యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్ రైలులో బెంగళూరు నుంచి భువనేశ్వర్‌కు పుణ్యక్షేత్రాలకు వెళ్తూ ప్రమాదవశాత్తు మరణించారు. మంగళవారం ఉదయం ఏలూరు రైల్వే స్టేషన్ పరిధిలోని వట్లూరు సమీపంలో రైలు నుంచి జారిపడి ఆయన మృతి చెందారు. రైల్వే హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News November 4, 2025

ఉసిరి నూనెతో ఒత్తైన జుట్టు

image

మన పూర్వీకులు తరతరాలుగా కురుల ఆరోగ్యం కోసం ఉసిరి నూనెను వాడుతున్నారు. ఈ నూనె వెంట్రుకల కుదుళ్లను బలోపేతం చేస్తుంది. అలాగే కురుల పెరుగుదలను వృద్ధి చేస్తుందంటున్నారు నిపుణులు. ఇందులోని యాంటీ యాసిడ్స్, ఫ్యాటీ యాసిడ్స్ వెంట్రుకలు రాలకుండా చూస్తాయి. కురులు తేమగా, మెరిసేలా చేస్తాయి. అలాగే చుండ్రుతో ఇబ్బంది పడుతుంటే ఉసిరి నూనెలోని యాంటీ మైక్రోబియల్ గుణం వల్ల సమస్య పరిష్కారం అవుతుంది. <<-se>>#haircare<<>>

News November 4, 2025

ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి: కలెక్టర్

image

జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సంబంధిత అధికారులను ఆదేశించారు. కొత్తకోట(M) పాలెం, కానాయపల్లి గ్రామాల్లోని చేసిన కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు వరి ధాన్యం కొనుగోలు కేంద్రానికి తెచ్చిన వెంటనే సీరియల్ నంబర్ల వారీగా ఎంత ధాన్యం తెచ్చారు, తేమ శాతం ఎంత ఉంది అనేది రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు.