News February 3, 2025

కల్వకుర్తి: కీలక కమిటీలో వంశీచంద్ రెడ్డికి చోటు

image

కల్వకుర్తి కాంగ్రెస్ నేత చల్లా వంశీచంద్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం కీలక పదవి కట్టబెట్టింది. ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్ ఆఫ్ లీడర్స్ అండ్ ఎక్స్‌పర్ట్స్ అనే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తూ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రెటరీ kc వేణుగోపాల్ ప్రకటన జారీ చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ కమిటీని 8మంది బృంద సభ్యులతో ఏర్పాటు చేయగా తెలంగాణకు చెందిన చల్లా వంశీచంద్ రెడ్డికి చోటు దక్కింది.

Similar News

News February 3, 2025

ఎమ్మెల్సీ ఎలక్షన్స్.. ఇవాళ నోటిఫికేషన్

image

MLC ఎన్నికలకు ఇవాళ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 10 వరకు నామినేషన్ల స్వీకరణ, 27న పోలింగ్, మార్చి 3న ఓట్ల లెక్కింపు ఉంటుంది. APలోని ఉ.గోదావరి, కృష్ణా-గుంటూరు గ్రాడ్యుయేట్ శ్రీకాకుళం-విజయనగరం-విశాఖ టీచర్ స్థానానికి ఎలక్షన్స్ జరగనున్నాయి. TGలోని వరంగల్-ఖమ్మం-నల్లగొండ, మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ ఉపాధ్యాయ, మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు జరుగుతాయి.

News February 3, 2025

అభిషేక్ హిట్టింగ్.. నేను చూసిన బెస్ట్ ఇన్నింగ్స్: బట్లర్

image

చివరి టీ20లో 135 పరుగులతో చెలరేగిన అభిషేక్ శర్మపై ఇంగ్లండ్‌ కెప్టెన్ జోస్ బట్లర్ ప్రశంసలు కురిపించారు. తాను ఇప్పటి వరకు ఎంతో క్రికెట్ చూశానని, అయితే అభిషేక్ హిట్టింగ్ తాను చూసిన బెస్ట్ ఇన్నింగ్స్ అని వెల్లడించారు. హోం సిరీస్‌లలో భారత్ అద్భుతమైన జట్టు అని చెప్పారు. సిరీస్ కోల్పోవడం బాధగా ఉందన్నారు. వన్డేల్లో పుంజుకునేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.

News February 3, 2025

MBNR: GET READY.. నేటి నుంచే ప్రయోగ పరీక్షలు

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్ సెకండరీ విద్యార్థులకు ఫిబ్రవరి 3 నుంచి 20 రోజులపాటు ప్రయోగ పరీక్షలు జరగనున్నాయి. MBNR-8400, WNPT-4,101, NGKL-2680, NRPT-2360, GDWL-2,230 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇప్పటికే విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 261 ఇంటర్మీడియట్ కళాశాలలో ఉండగా.. ప్రతి కళాశాలలో సీసీ కెమెరాలు పకడ్బందీగా ఏర్పాటు చేశారు.