News February 2, 2025
కల్వకుర్తి: కునుకు తీసిన గుడ్లగూబ
కల్వకుర్తి పట్టణం గాంధీనగర్ కాలనీలోని ఓ దుకాణం వద్ద ఓ గుడ్లగూబ ఆదివారం కునుకు తీస్తూ కనిపించింది. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ నిద్రపోతున్న గుడ్లగూబను కాలనీ ప్రజలు, అటుగా వెళ్లేవారు ఆసక్తిగా తిలకించారు. అడవిలో ఉండే ఈ పక్షి కాంక్రీట్ జంగిల్‌గా మారిన పట్టణంలో కునుకు తీస్తూ కనిపించటంతో ఆసక్తి నెలకొంది. ఈ గుడ్లగూబను పలువురు కెమెరాలో బంధించారు.
Similar News
News February 2, 2025
వైసీపీపై రెచ్చిపోయిన నాగబాబు
పుంగనూరులోని సోమల జడ్పీ హై స్కూల్ మైదానంలో ఆదివారం ‘జనంలోకి జనసేన’ కార్యక్రమంలో వైసీపీపై జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలైంది. అప్పుడే వైసీపీ గూండాలు, సన్నాసులు ఇంకా అవి చేయలేదు, ఇవి చేయలేదని అంటున్నారు. ఇప్పటికే తాము పెన్షన్ పెంపు, ఏడాదికి మూడు సిలిండర్లు, రాష్ట్రంలో రోడ్ల నిర్మాణాలు, డీఎస్సీ, పోలీస్ పోస్టులకు చర్యలు చేపట్టాం’ అని పేర్కొన్నారు.
News February 2, 2025
జగిత్యాల: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం కలిగోట గ్రామానికి చెందిన డిచ్పల్లి పెద్ద గంగారం (48) అనే రైతు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. రైతు సాగుతో పాటు గొర్రెల కాపరిగా పనిచేస్తారు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో పెద్ద గంగారాం శనివారం రాత్రి గ్రామశివారులోని అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నవీన్ కుమార్ పేర్కొన్నారు.
News February 2, 2025
నా అవార్డు మా నాన్నకు అంకితం: గొంగడి త్రిష
భారత్ అండర్-19 టీ20 వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన తెలుగమ్మాయి గొంగడి త్రిష ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ పురస్కారాన్ని తన తండ్రికి అంకితమిచ్చారు. ‘నన్ను ప్రోత్సహించిన అందరికీ ధన్యవాదాలు. మాజీ ప్లేయర్ మిథాలీరాజ్ నాకు ఆదర్శం. అండర్-19 వరల్డ్ కప్ భారత్‌ను వదిలి వెళ్లకూడదని అనుకున్నాను. నా బలాలపైనే దృష్టి పెట్టి ఆడాను. దేశానికి మరిన్ని మ్యాచులు ఆడి గెలవాలన్నది నా లక్ష్యం’ అని తెలిపారు.