News January 3, 2025

కల్వకుర్తి: తాండ్ర ఉన్నత పాఠశాల అభివృద్ధికి రూ.5 కోట్లు 

image

కల్వకుర్తి మండలంలోని తాండ్ర గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధికి రూ.5 కోట్లు మంజూరయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి తాండ్ర పాఠశాలలో చదువుకున్నారు. ఇటీవల కల్వకుర్తిలో పర్యటించిన సందర్భంగా తాండ్ర పాఠశాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. హామీ మేరకు నిధులు మంజూరు కావడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News December 15, 2025

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్యంశాలు..!

image

✒PHASE-3 ఎన్నికలకు భారీ బందోబస్తు:ఎస్పీలు
✒NGKL: నిన్న గెలుపు.. అర్ధరాత్రి మృతి
✒PHASE-3 పూర్తయ్యే వరకు MCC అమల్లోనే: ఎస్పీ
✒100% ఓటర్ స్లిప్స్ పంపిణీ పూర్తి:కలెక్టర్లు
✒PHASE-3 ఏర్పాట్లు పూర్తి చేయాలి: కలెక్టర్లు
✒పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్
✒నూతన సర్పంచులను అభినందించిన ఎమ్మెల్యేలు
✒పోలింగ్ సామగ్రి పంపిణీ: కలెక్టర్లు

News December 15, 2025

MBNR: ఆరోజు వైన్ షాపులు బంద్: ఎస్పీ

image

పోలింగ్ స్టేషన్ ప్రాంగణంలో లేదా 100 మీటర్ల పరిధిలో మొబైల్ ఫోన్లు, కార్డ్‌లెస్ ఫోన్లు, వైర్‌లెస్ సెట్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం పూర్తిగా నిషేధమని ఎస్పీ డి.జానకి తెలిపారు. మూడో విడుత సర్పంచ్ ఎన్నికల భద్రతా దృష్ట్యా మద్యం దుకాణాలు ఈనెల 15 సా.5:00 గంటల నుంచి 18 ఉ.10:00 గంటల వరకు పూర్తిగా మూసివేయాలని, మద్యం అక్రమ రవాణాకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News December 15, 2025

MBNR: గుంపులుగా గుమికూడరాదు: ఎస్పీ

image

మూడో విడత ఎన్నికల నేపథ్యంలో 163 BNSS (144 సెక్షన్) అమల్లో ఉన్నందున ఎన్నికల కేంద్రాల పరిసరాల్లో 100 మీటర్ల పరిధిలో ఐదుగురు/అంతకన్నా ఎక్కువ మంది గుంపులుగా గుమికూడరాదని ఎస్పి డి.జానకి సూచించారు. పోలింగ్‌కు ముందు(15న) సాయంత్రం 5:00 గంటల నుంచి పోలింగ్ పూర్తయ్యే వరకు సైలెంట్ పీరియడ్ అమల్లో ఉంటుందని, ఈ సమయంలో ఎన్నికల సభలు, సమావేశాలు,ఇంటింటా ప్రచారం,లౌడ్‌స్పీకర్ల వినియోగం,ర్యాలీలు పూర్తిగా నిషేధమన్నారు.