News April 2, 2025

కల్వకుర్తి: పిల్లల మృతిపై వీడిన మిస్టరీ.. తల్లే హంతకురాలు!

image

HYD అమీన్‌పూర్‌లో గత నెల 27న కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఆకస్మికంగా మృతిచెందగా తల్లి ఆస్పత్రిలో చికిత్స పొందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు అసలు నిజం తెలిసింది. కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండలం మెదక్‌పల్లి వాసి చెన్నయ్య భార్య తన టెన్త్ క్లాస్‌ స్నేహితుడి ప్రేమలో పడింది. ఈ క్రమంలో ఆమె ముగ్గురు పిల్లలకు విషం ఇచ్చి చంపేసిందని పోలీసుల విచారణలో తేలింది. 

Similar News

News February 10, 2026

గుడ్డులోని పచ్చసొనతో కొలెస్ట్రాల్ పెరుగుతుందా?

image

గుడ్డు పచ్చసొన (Yolk) తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని చాలామంది ఎగ్ వైట్ మాత్రమే తింటారు. అయితే పచ్చసొనలో విటమిన్ A, E, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి కీలక పోషకాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. మన శరీరంలోని 85% కొలెస్ట్రాల్‌ను కాలేయమే ఉత్పత్తి చేస్తుంది. ఆహారం ద్వారా వచ్చే కొలెస్ట్రాల్ ప్రభావం తక్కువే. పచ్చసొనలోని పోషకాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి.

News February 10, 2026

శ్రీశైలంలో మల్లన్న దర్శనానికి 4 గంటల సమయం

image

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవరోజు మంగళవారం శ్రీశైలానికి భక్తులు పోటెత్తారు. మంగళవారం మ.12 గంటల సమయానికి 32,870 మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వీరిలో 14,280 మంది కాలినడకన వచ్చారు. 12,931 మంది శివస్వాములు స్పర్శ దర్శనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. రద్దీ కారణంగా దర్శనానికి 4 గంటల నుంచి సమయం పడుతోంది. భక్తులకు అసౌకర్యం కలగకుండా అధికారులు చర్యలు చేపట్టారు.

News February 10, 2026

BOB క్యాపిటల్ మార్కెట్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

BOB క్యాపిటల్ మార్కెట్ లిమిటెడ్‌ మేనేజర్, AVP ఫైనాన్స్& అకౌంట్స్, స్టేట్ హెడ్ రిటైల్ బ్రోకింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు నేటి నుంచి ఫిబ్రవరి 28 వరకు careers@bobcaps.in ఈ మెయిల్ ద్వారా అప్లై చేసుకోవాలి. పోస్టును బట్టి డిగ్రీ, PG/CA/MBA అర్హతతో పాటు పనిఅనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://www.bobcaps.in