News February 7, 2026

కల్వకుర్తి మున్సిపల్ పీఠం దక్కేది ఎవరికో..?

image

మున్సిపల్ ఎన్నికల వేళ కల్వకుర్తిలో రాజకీయ వేడి రాజుకుంది. చైర్మన్ పీఠం కోసం ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. కాంగ్రెస్ నుంచి రత్నమాల, బీఆర్ఎస్ నుంచి రాధిక, బీజేపీ నుంచి గుర్రాల జ్యోతి బరిలో నిలిచి గట్టి పోటీ ఇస్తున్నారు. ముగ్గురు మహిళా అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. పట్టణ ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారనే చర్చ జోరుగా సాగుతోంది.

Similar News

News February 18, 2026

భార్యకు ఎమోషనల్ విషెస్ తెలిపిన మెగాస్టార్

image

‘నా విజయ రహస్యం నీవే’ అంటూ భార్య సురేఖకు మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్‌గా బర్త్ డే విషెస్ తెలియజేశారు. 1980 ఫిబ్రవరి 20న వివాహ బంధంతో మొదలైన తమ ప్రయాణంలో భార్యే తన అతిపెద్ద శక్తి అని కొనియాడారు. ‘కుటుంబ బాధ్యతలన్నీ సురేఖ చూసుకోవడం వల్లే నేను వృత్తిపై దృష్టి పెట్టగలిగా. నా తల్లిదండ్రులకు ఆమె సొంత కూతురిలా నిలిచింది. సంక్షోభంలో, సంతోషంలో అండగా నిలిచిన సురేఖకు హృదయపూర్వక కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు.

News February 18, 2026

రేపు వేల్పూరులో పర్యటించనున్న YS షర్మిల

image

ఉపాధిహామీ పథకంపై ప్రజాభిప్రాయ సేకరణకు కాంగ్రెస్ ప్రభుత్వం రచ్చబండ కార్యక్రమం చేపట్టింది. దీంతో శావల్యాపురం మండలం వేల్పూరుకు AICC అధ్యక్షురాలు YS షర్మిల గురువారం రానున్నట్లు వినుకొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ రామాంజనేయులు తెలిపారు. BJP ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేసిందన్నారు. రాష్ట్రాలపై అదనపు భారం మోపుతోందని విమర్శించారు. దీంతో రాష్ట్రాల అభివృద్ధి పూర్తిగా కుంటుపడే ప్రమాదముందన్నారు.

News February 18, 2026

వరంగల్: HCA జట్టులో కృష్ణవేణికి చోటు

image

వరంగల్ క్రీడాకారిణి కృష్ణవేణి ప్రతిభకు తగిన గుర్తింపు లభించింది. మహిళల క్రికెట్ జట్టులో బ్యాటింగ్, స్పిన్ బౌలింగ్‌లో రాణించిన కృష్ణవేణి HCA సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించి, నేటి నుంచి రాంచీ స్టేడియంలో BCCI నిర్వహిస్తున్న వన్‌-డే మహిళల టోర్నీలో HCA జట్టులో చోటు దక్కించుకుంది. పోటీల్లో బెస్ట్-11 తుది జట్టులో కృష్ణవేణి చోటు దక్కించుకోవడం పట్ల జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.