News August 28, 2025

కల్వకుర్తి: వంతెన నిర్మాణ పనులను వేగవంతంగా చేపట్టాలి- కలెక్టర్

image

కల్వకుర్తి మండలంలోని రఘుపతిపేట-రామగిరి గ్రామాల మధ్య ఉన్న దుందుభి వాగుపై చేపట్టిన వంతెన నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశించారు. దుందుభి వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో గురువారం ఆయన వాగును పరిశీలించారు. ప్రజలు వాగు దాటకుండా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. భారీ వర్షాలు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

Similar News

News August 28, 2025

బెల్లంపల్లిలో సెంట్రల్ రైల్వే సేఫ్టీ బోర్డు ఛైర్‌పర్సన్ పర్యటన

image

బెల్లంపల్లి, బల్లార్షా రైల్వే సెక్షన్ల మధ్య నూతనంగా చేపట్టిన థర్డ్ లైన్ ట్రాక్‌ను గురువారం సెంట్రల్ రైల్వే సేఫ్టీ బోర్డు ఛైర్‌పర్సన్ మాధవీలత ప్రారంభించారు. థర్డ్ లైన్‌ను పర్యవేక్షించే అధికారులకు సంబంధించిన నూతన కార్యాలయాన్ని ఆమె పరిశీలించి తగు సూచనలు చేశారు. బెల్లంపల్లి రైల్వే స్టేషన్‌లో రైల్వే అధికారులు చేపట్టిన థర్డ్ లైన్ ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు.

News August 28, 2025

MHBD: విద్యా శాఖ పనితీరుపై కలెక్టర్ సమీక్ష

image

జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ విద్యా శాఖ పనితీరుపై గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన జిల్లాలోని 898 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరచడానికి విద్యా శాఖ తీసుకుంటున్న చర్యలు, కార్యక్రమాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇందులో భాగంగా అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాలను సమర్పించారు.

News August 28, 2025

బెల్లంపల్లి: సింగరేణి ఏరియా ఆసుపత్రి డీవైసీఎంవో బదిలీ

image

బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రి డిప్యూటీ చీఫ్ మెడికల్ అధికారి మధు కుమార్ రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రికి బదిలీ అయ్యారు. గోదావరిఖని సింగరేణి ఏరియా ఆసుపత్రి డిప్యూటీ చీఫ్ మెడికల్ అధికారి పాండురంగ చారి బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రికి బదిలీపై రానున్నారు. రాబోయే రెండు రోజుల్లో పాండురంగ చారి బెల్లంపల్లిలో ఉద్యోగ బాధ్యతలు తీసుకోనున్నారు.