News December 4, 2025

కల్వకుర్తి: సర్పంచ్ ఎన్నికల బరిలో రిటైర్డ్ ఉపాధ్యాయుడు

image

కల్వకుర్తి మండలంలోని మార్చాల గ్రామపంచాయతీ ఎన్నికల బరిలో రిటైర్డ్ ఉపాధ్యాయుడు తలసాని వెంకట చల్మారెడ్డి నిలిచారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం ప్రయత్నించినప్పటికీ ఆయన ప్రయత్నాలు ఫలించకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు. ఉపాధ్యాయ వృత్తి నుంచి రిటైర్డ్ అయిన నేను ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో సర్పంచ్ గా పోటీ చేస్తున్నట్లు Way2Newsకు తెలిపారు.

Similar News

News December 4, 2025

సంగారెడ్డి: ‘ర్యాగింగ్‌కు పాల్పడితే జైలుకే’

image

కళాశాలలో ఎవరైనా ర్యాగింగ్‌కు పాల్పడితే అక్కడే చర్యలు తీసుకుంటారని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి సౌజన్య హెచ్చరించారు. సంగారెడ్డి మెడికల్ కళాశాలలో ర్యాగింగ్‌పై అవగాహన సమావేశం గురువారం నిర్వహించారు. ర్యాగింగ్‌కు పాల్పడితే విద్యార్థులకు జైలు శిక్ష విధిస్తారని చెప్పారు. అధ్యాపకులు, ప్రొఫెసర్లు ప్రత్యేక చొరవ తీసుకొని ఇలాంటి ఘటనకు జరగకుండా చూడాలని పేర్కొన్నారు

News December 4, 2025

ఆడ‌బిడ్డ‌ల‌ను కోటీశ్వ‌రుల‌ను చేయ‌డ‌మే ల‌క్ష్యం: సీఎం

image

స్వ‌యం స‌య‌హాక మ‌హిళ‌లకు రూ.175 కోట్లతో పెట్రోల్ బంకులు మంజూరు చేయడం, ఇతర సంక్షేమ పథకాలతో కోటి మంది ఆడ‌బిడ్డ‌ల‌ను కోటీశ్వ‌రుల‌ను చేయ‌డ‌మే తన ల‌క్ష్యం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ సభలో గురువారం రూ.19.69 కోట్లతో ఇందిరా మహిళ శక్తి కింద స్వయం సహాయక సంఘాలకు రుణాలకు సంబంధించిన చెక్కు అందజేశారు. 65 ల‌క్ష‌ల మంది స్వ‌యం సయ‌హాక మ‌హిళ‌ల‌కు ఇందిర‌మ్మ చీర‌ల‌ను పంచామన్నారు.

News December 4, 2025

KNR: చేతిలో చంటిబిడ్డతో నామినేషన్

image

వీర్నపల్లి మండలం అడవిపదిర సర్పంచ్ అభ్యర్థిగా జాలపల్లి సౌందర్య మనోజ్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఆమె తన 11 రోజుల చిన్నారితో నామినేషన్ దాఖలు చేయడం విశేషం. గ్రామంలో మార్పు తీసుకురావాలంటే గ్రామ అభివృద్ధి కోసం తనకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థించారు.